ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CBSE : వచ్చే ఏడాది 10, 12వ తరగతి సిలబస్ 15 శాతం కట్.. సీబీఎస్ఈ క్లారిటీ

ABN, Publish Date - Nov 15 , 2024 | 12:16 PM

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించే 10, 12వ తరగతుల బోర్డు పరీక్షల్లో 15 శాతం సిలబస్ కోత విధించనున్నట్లు వచ్చిన వార్తలపై క్లారిటీ వచ్చింది. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

CBSE

గత కొన్ని రోజులుగా 2025 బోర్డు పరీక్షల కోసం CBSE 10, 12 తరగతుల సిలబస్‌లో 15 శాతం కట్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై CBSE స్పందించింది. ఈ క్రమంలో సిలబస్ తగ్గింపు చేస్తున్నట్లు వస్తున్న ప్రకనటల్లో నిజం లేదని తెలిపింది. అలాంటి విధానపరమైన నిర్ణయం తీసుకోలేదని బోర్డు స్పష్టం చేసింది. ఇండోర్‌లో జరిగిన స్కూల్ ప్రిన్సిపాల్స్ సమ్మిట్ 'బ్రిడ్జింగ్ ది గ్యాప్'లో బోర్డు ప్రాంతీయ అధికారి వికాస్ కుమార్ అగర్వాల్‌ మాట్లాడిన క్రమంలో పేర్కొన్నారు. బోర్డు అటువంటి నోటీసును జారీ చేయలేదన్నారు.


నిర్ణయాల మార్పు విషయంలో

మూల్యాంకన విధానం లేదా పరీక్షా విధానంలో ఎటువంటి మార్పులు చేయలేదని, బోర్డు నిర్ణయాలకు సంబంధించిన సమాచారం అధికారిక వెబ్‌సైట్ ద్వారా లేదా అధీకృత ఛానెల్‌ల ద్వారా మాత్రమే ప్రచురించబడుతుందని CBSE ఒక నోట్‌లో వెల్లడించింది. అందువల్ల సిలబస్ కట్ వంటి నివేదికలు నిరాధారమైనవని నోట్ పేర్కొంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) బోర్డు ఎటువంటి నోటీసును జారీ చేయలేదని లేదా మూల్యాంకన విధానంలో లేదా పరీక్షా విధానంలో ఎలాంటి మార్పులు చేయలేదని చెప్పింది. దీనికి సంబంధించి అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదని స్పష్టం చేసింది.


పరీక్షలు ఎప్పుడంటే..

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 10, 12వ బోర్డ్ ఎగ్జామినేషన్ 2025 ఫిబ్రవరి 15, 2025 నుంచి నిర్వహించబడుతుంది. ఈ సంవత్సరం ఫలితాల ప్రకటనతో పాటు బోర్డు దీనిని ప్రకటించింది. గత సంవత్సరం CBSE బోర్డు పరీక్ష 2024 కూడా ఫిబ్రవరి 15న నిర్వహించబడింది. CBSE బోర్డు పరీక్ష 2025లో హాజరు కావాలంటే 10, 12వ తరగతి విద్యార్థులు తప్పనిసరిగా పాఠశాలలో 75 శాతం హాజరు కలిగి ఉండాలి.


ఇవే ప్రచారం

అయితే సీబీఎస్ఈ 2025 బోర్డు పరీక్షలకు 10, 12వ తరగతి సిలబస్‌లో 15% వరకు తగ్గింపు ఉంటుందని ప్రచారం జరిగింది. ఈ క్రమంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ద్వారా 40% ఇంటర్నల్ అసెస్‌మెంట్ వెయిటేజీని ప్రవేశపెట్టినట్లు నివేదికలు వచ్చాయి. ఆన్‌లైన్‌లో పలు వార్తాపత్రికలు, సోషల్ మీడియాలో ఈ వార్తలు చక్కర్లు కొట్టాయి. వీటిని పరిగణనలోకి తీసుకున్న బోర్డు అవన్నీ తప్పుడు నివేదికలని పేర్కొంది. అధికారిక సమాచారం కోసం cbse.gov.in ను సందర్శించాలని తెలిపింది.


ఇవి కూడా చదవండి:

SIP Investment: చిరు ఉద్యోగస్తులకు గుడ్‌ న్యూస్.. రూ.99 నుంచే మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు

Viral News: 2050కి కోటి రూపాయల విలువ ఎంత.. ఏఐ సమాధానం తెలిస్తే షాక్..


Bank Holidays: నవంబర్ 2024లో బ్యాంక్ సెలవులు.. దాదాపు సగం రోజులు బంద్..

PAN Aadhaar: పాన్ ఆధార్ ఇంకా లింక్ చేయలేదా.. ఇప్పుడే చేసుకోండి, గడవు సమీపిస్తోంది..


Read More Education News and Latest Telugu News

Updated Date - Nov 15 , 2024 | 12:19 PM