Diksuchi : టైమ్ సీక్వెన్స్ టెస్ట్
ABN, Publish Date - Aug 05 , 2024 | 05:03 AM
ఈ చాప్టర్‌కు సంబంధించిన ప్రశ్నలలో వివిధ సంఘటలకు అంటే బస్సు, రైళ్ల సమయాలు, పెండ్లిరోజు, పుట్టినరోజుల తేదీలు, వివిధ సమావేశాల సమయాలు ఈ విధంగా సమాచారం ఇస్తారు. దానిని జాగ్రత్తగా అవగాహన చేసుకొని పెళ్లిళ్లు, పుట్టిన రోజుల తేదీలను, రైలు, బస్సు, సమావేశాల సమయాలు మొదలైన వాటికి సమాధానాలు రాబట్టవలసి ఉంటుంది.
రీజనింగ్
ఈ చాప్టర్‌కు సంబంధించిన ప్రశ్నలలో వివిధ సంఘటలకు అంటే బస్సు, రైళ్ల సమయాలు, పెండ్లిరోజు, పుట్టినరోజుల తేదీలు, వివిధ సమావేశాల సమయాలు ఈ విధంగా సమాచారం ఇస్తారు. దానిని జాగ్రత్తగా అవగాహన చేసుకొని పెళ్లిళ్లు, పుట్టిన రోజుల తేదీలను, రైలు, బస్సు, సమావేశాల సమయాలు మొదలైన వాటికి సమాధానాలు రాబట్టవలసి ఉంటుంది.
1.పవన్‌కు అతని సోదరుడు శ్యామ్ పుట్టినరోజు ఆగస్టు 3 నుంచి ఆగస్టు 8 మధ్య అని గుర్తు. అతని తండ్రి శ్రీనివా్‌సకు తన కుమారుని పుట్టినరోజు ఆగస్టు 6 నుంచి ఆగస్టు 10 మధ్య అని గుర్తు. అయితే శ్యామ్ పుట్టినరోజు ఏ రోజు అవుతుంది?
ఎ) ఆగస్టు 7 బి) ఆగస్టు 8 సి) ఆగస్టు 6 డి) ఏదీకాదు
సమాధానం: (ఎ)
వివరణ: పవన్‌కు అతని సోదరుడు శ్యామ్ పుట్టినరోజు ఆగస్టు 3 నుంచి ఆగస్టు 8 మధ్య అని గుర్తు. ఇచ్చిన తేదీలకు మధ్యలోని తేదీలు 4, 5, 6, 7. అతని తండ్రి శ్రీనివా్‌సకు తన కుమారుని పుట్టినరోజు ఆగస్టు 6 నుంచి ఆగస్టు 10 మధ్య అని గుర్తు. ఇచ్చిన తేదీలకు మధ్య తేదీలు 7, 8, 9. రెండింటిలో కామన్‌గా ఉండే తేదీ 7. అనగా ఆగస్టు 7 సమాధానం అవుతుంది.
2.ఒక రైలు ముంబయ్‌కి ప్రతి 75 ని.లకు ఉంది. విచారణాధికారి తనను కలిసిన ప్రయాణికునితో రైలు వెళ్ళిపోయి 20 ని.లు అయినది. తరవాత రైలు 10.00 ఎ.ఎం. అని చెప్పాడు. అయితే ఈ సమాచారాన్ని విచారణాధికారి ప్రయాణికునితో ఏ సమయంలో చెప్పాడు?
ఎ) 9.05 ఎ.ఎం. బి) 9.00 ఎ.ఎం.
సి) 9.15 ఎ.ఎం. డి) 9.10 ఎ.ఎం.
సమాధానం: (ఎ)
వివరణ: రైలు ముంబయ్‌కి ప్రతి 75 ని.లు అనగా 1 గంట 15 ని.లకు ఉంది. తదుపరి రైలు వచ్చే సమయం 10.00 ఎ.ఎం. అని ఇచ్చారు. అంటే దాని ముందు రైలు వచ్చిన సమయం 10.00-1 గంట 15 ని. = గం. 8.45 ని. విచారణాధికారి ప్రయాణికునితో రైలు వెళ్ళిపోయి 20 ని.లు అయిందని చెప్పాడు. దాని అర్థం ప్రయాణికుడు 20 ని.లు ఆలస్యంగా వచ్చాడు. (ఆలస్యంగా వస్తేనే కదా రైలు వెళ్ళిపోయింది) కాబట్టి విచారణాధికారి, ప్రయాణికునికి మధ్య సంభాషణ జరిగిన సమయం 8.45 + 20 = గం. 9.05 నిలు సమాధానం అవుతుంది.
3.తేజ బస్టాండులో ఒక బస్సు కోసం ఎదురు చూస్తున్నాడు. అతని చేతి గడియారం 10 ని.లు ఎక్కువగా చూపిస్తున్నది. ఉదయం 7 గంటలకు రావలసిన ఒక బస్సు 20 ని.లు ఆలస్యంగా వచ్చింది. అయితే బస్సు వచ్చిన సమయంలో తేజ చేతి గడియారం ఏ సమయాన్ని చూపిస్తుంది?
ఎ) 7.30 ఎ.ఎం. బి) 7.20 ఎ.ఎం.
సి) 7.15 ఎ.ఎం. డి) ఏదీకాదు
సమాధానం: (ఎ)
వివరణ: 7 గం.లకు రావలసిన బస్సు 20 నిశ్రీశ్రీ ఆలస్యంగా వచ్చింది. అనగా బస్సు వచ్చిన సమయం ఉదయం 7.20 ని.లు. తేజ గడియారం 10 ని.లు అధికంగా చూపిస్తున్నదని అర్థం. బస్సు వచ్చిన సమయంలో తేజ చేతి గడియారం చూపిస్తున్న సమయం ఉదయం 7.30 ని.లు.
4.ఒక పుస్తకాన్ని సౌమ్య సోమవారం చదివింది. అదే పుస్తకాన్ని సుధ, సౌమ్యకు తరవాత 4వ రోజున, స్వప్నకు ముందురోజున చదివింది. అయితే ఆ పుస్తకాన్ని స్వప్న ఏ రోజున చదివింది?
ఎ) శుక్రవారం బి) శనివారం
సి) గురువారం డి) ఏదీకాదు
సమాధానం: (బి)
వివరణ: సౌమ్య పుస్తకాన్ని సోమవారం చదివింది. సుధ, సౌమ్యకు తరవాత 4వ రోజు అనగా
సోమవారం తరవాత
మంగళవారం
బుధవారం
గురువారం
శుక్రవారం రోజున సుధ చదివింది.
సుధ, స్వప్నకు ముందురోజు చదివింది అంటే దీని అర్థం స్వప్న, సుధకు తరవాత రోజు చదివింది. అంటే శనివారం స్వప్న చదివింది.
(స్వప్న శనివారం చదివితేనే కదా సుధ, స్వప్న కంటే ఒక రోజు ముందు శుక్రవారం ఉండేది)
5.రాజు ప్రతి సోమవారం, బుధవారం, శనివారం; రవి ప్రతి సోమవారం, గురువారం, శుక్రవారం, శనివారం ఒకే సమయంలో నడకకు (వాకింగ్) వెళతారు. అయితే వారిద్దరూ గురువారంతో ప్రారంభమయ్యే జూలై నెలలో ఎన్నిసార్లు కలుసుకొంటారు?
ఎ) 8 బి) 9 సి) 10 డి) ఏదీకాదు
సమాధానం: (బి)
వివరణ: గమనించండి రాజు, రవి నడకకు వెళ్ళే రోజులలో కామన్‌గా ఉన్న రోజులు సోమవారం, శనివారం. గురువారంతో ప్రారంభమయ్యే జూలై నెల అంటే జూలై 1 గురువారం, జూలై 2 శుక్రవారం, జూలై 3 శనివారం.
జూలై 3 శనివారం అదేవిధంగా
జూలై 10 శనివారం జూలై 5 సోమవారం
జూలై 17 శనివారం జూలై 12 సోమవారం
జూలై 24 శనివారం జూలై 19 సోమవారం
జూలై 31 శనివారం జూలై 26 సోమవారం
పై వివరణను బట్టి వారిరువురూ కలుసుకునే
రోజులు ‘9’ అని తెలుస్తున్నది.
డాక్టర్ పండిటి మీనాక్షి పవన్,
సీనియర్ ఫ్యాకల్టీ
Updated Date - Aug 05 , 2024 | 05:23 AM