LIC: ఎల్‌ఐసీ గోల్డెన్ జూబ్లీ స్కాలర్‌షిప్ స్కీమ్-2024.. ఇంటర్, డిప్లొమా చేసిన వారు గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఇవే..
ABN, Publish Date - Dec 18 , 2024 | 04:33 PM
ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థుల్ని ప్రోత్సహించేందుకు గోల్డెన్‌జూబ్లీ స్కాలర్‌షిప్ స్కీం- 2024 పేరిట లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) సరికొత్త స్కాలర్‌షిప్ పథకం తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా ప్రతిభ ఉన్న విద్యార్థులకు నగదు ప్రోత్సాహకం అందిస్తుంది.
ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థుల్ని ప్రోత్సహించేందుకు గోల్డెన్‌జూబ్లీ స్కాలర్‌షిప్ స్కీం- 2024 పేరిట లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) సరికొత్త స్కాలర్‌షిప్ పథకం తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా ప్రతిభ ఉన్న విద్యార్థులకు నగదు ప్రోత్సాహకం అందిస్తుంది. అర్హత, అర్హులు.. దరఖాస్తు తేదీలు వంటి వివరాలను ఎక్స్ (ట్విటర్) ద్వారా వెల్లడించింది. 2021-22, 2022-23, 2023-24 విద్యా సంవత్సరాల్లో పదో తరగతి లేదా ఇంటర్మీడియెట్ లేదా డిప్లొమా పూర్తి చేసుకున్న విద్యార్థులు ఈ స్కాలర్ షిప్ పొందేందుకు అర్హులు. వీరు గుర్తింపు పొందిన ఏదైనా విద్యా సంస్థ నుంచి కనీసం 60 శాతం మార్కులైనా సాధించి ఉండాలి (LIC Golden Jubilee Scholarship Scheme 2024).
మెడిసిన్, గ్రాడ్యుయేషన్, ఇంజినీరింగ్, లేదా ఏదైనా విభాగంలో డిప్లొమా చేయాలనుకుంటున్నా, వొకేషన్ కోర్సులు చేయాలన్నా, ఐటీఐ చదువుకోవాలనుకుంటున్నా ఈ నగదు భరోసా పథకాన్ని అందిస్తారు. ఎల్ఐసీ అధికారిక వెబ్‌సైట్.. www.licindia.in ద్వారా ఆన్‌లైన్‌లోనే ఈ స్కీం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 8 (ఆదివారం) నుంచే ప్రారంభమైంది. ఈ పథకానికి అప్లయ్ చేసుకునేందుకు చివరి తేదీ డిసెంబర్ 22తో ముగియనుంది. ఈ పథకం ద్వారా స్పెషల్ గర్ల్ చైల్డ్ స్కాలర్‌షిప్ కూడా ఇస్తారు. రెండేళ్ల పాటు ఈ స్కాలర్‌షిప్‌ను అందిస్తారు.
ఈ పథకం కింద స్కాలర్ షిప్ దక్కించుకోవాలనుకుంటే సదరు విద్యార్థి తల్లిదండ్రుల వార్షికాదాయం 2.5 లక్షల కంటే తక్కువ ఉండాలి. ఇతర ట్రస్ట్‌లు, సంస్థల నుంచి స్కాలర్‌షిప్ పొందుతున్న విద్యార్థులు ఈ పథకానికి అనర్హులు. అలాగే పార్ట్ టైమ్ క్లాస్‌లు, ఓపెన్ యూనివర్సిటీ ద్వారా చదువుతున్న వారికి కూడా ఈ పథకం వర్తించదు. ఈ పథకానికి అర్హత సాధించి మెడిసిన్ చదువుతున్న విద్యార్థులు రూ.40 వేల స్కాలర్ షిప్ పొందుతారు. ఇంజినీరింగ్ విద్యార్థులు రూ.30 వేలు, గ్రాడ్యుయేట్ విద్యార్థులు రూ.20 వేలు పొందుతారు. పూర్తి వివరాల కోసం ఎల్‌ఐసీ అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించాలి.
మరిన్ని ఎడ్యుకేషన్ వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Dec 18 , 2024 | 06:22 PM