ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Jobs: LICలో ఉద్యోగాలకు నేడు లాస్ట్ డేట్.. అప్లై చేశారా లేదా..

ABN, Publish Date - Aug 14 , 2024 | 10:11 AM

ప్రభుత్వ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్‌లో 200 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల కోసం రిక్రూట్ మెంట్ నిర్వహిస్తున్నారు. అయితే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు నేడు (ఆగస్టు 14, 2024) చివరి తేదీగా నిర్ణయించబడింది.

lic jobs

ప్రభుత్వ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్‌లో 200 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల(jobs) కోసం రిక్రూట్ మెంట్ నిర్వహిస్తున్నారు. అయితే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు నేడు (ఆగస్టు 14, 2024) చివరి తేదీగా నిర్ణయించబడింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా మీరు ఈ పోస్టులకు అప్లై చేయకపోతే ఇప్పుడే చేసేయండి మరి. అయితే ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలి, దీనిలో ఎంపికైన వారికి ఎలాంటి జీత భత్యాలు ఉంటాయనేది ఇప్పుడు తెలుసుకుందాం.


వయస్సు

ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు కనీసం 60 శాతం మార్కులతో గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇన్‌స్టిట్యూట్ నుంచి గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి. కరస్పాండెన్స్/ డిస్టెన్స్/ పార్ట్ టైమ్ ద్వారా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేయలేరు. దీంతో పాటు అభ్యర్థి కనీస వయస్సు 21 సంవత్సరాల కంటే తక్కువ ఉండకూడదు. గరిష్ట వయస్సు 28 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు. జులై 1, 2024 తేదీని దృష్టిలో ఉంచుకుని వయస్సు లెక్కించబడుతుంది.


ఎలా దరఖాస్తు చేయాలి

  • ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేయడానికి ముందుగా మీరు అధికారిక వెబ్‌సైట్ lichousing.comకి వెళ్లాలి

  • వెబ్‌సైట్ హోమ్ పేజీలో మీరు కెరీర్ బటన్‌పై క్లిక్ చేసి, రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన అప్లికేషన్ లింక్‌పై క్లిక్ చేయండి

  • దీని తర్వాత మీరు ముందుగా కొత్త రిజిస్ట్రేషన్‌పై క్లిక్ చేసి నమోదు చేసుకోవాలి

  • రిజిస్ట్రేషన్ తర్వాత, మీరు ఇతర వివరాలు, ఫోటోగ్రాఫ్, సంతకం వివరాలను అప్‌లోడ్ చేయాలి

  • ఆ తర్వాత మీరు నిర్ణీత రుసుమును చెల్లించి, ఫారమ్‌ను సమర్పించండి

  • చివరగా, పూర్తిగా నింపిన అప్లికేషన్ ఫారమ్ ప్రింటవుట్ తీసుకొని దానిని సురక్షితంగా ఉంచుకోండి


దరఖాస్తు రుసుము

అన్ని కేటగిరీల అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ. 800 చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు రుసుమును డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, మొబైల్ వాలెట్ మొదలైన వాటి ద్వారా చెల్లించవచ్చు. ఒకసారి ఫీ చెల్లింపు చేస్తే తిరిగి ఇవ్వబడదు.

వేతనం

నెలకు మొత్తం వేతనాలు రూ.32,000 నుంచి 35,200/- వరకు ఉంటాయి (పోస్టింగ్ చేసే స్థలంపై ఆధారపడి సాలరీ మారుతుంది). ఇందులో ప్రాథమిక చెల్లింపు, HRA, ఇతర ప్రయోజనాలు & PF వంటివి కూడా లభిస్తాయి.


LIC HFL రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేసే ఖాళీలు రాష్ట్రాల వారీగా వివరాలు

  • మహారాష్ట్ర: 53

  • కర్ణాటక: 38

  • తెలంగాణ: 31

  • ఉత్తరప్రదేశ్: 17

  • మధ్యప్రదేశ్: 12

  • ఆంధ్రప్రదేశ్: 12

  • తమిళనాడు: 10

  • ఛత్తీస్‌గఢ్: 6

  • అస్సాం: 5

  • గుజరాత్: 5

  • పశ్చిమ బెంగాల్: 5

  • హిమాచల్ ప్రదేశ్: 3

  • జమ్మూ కశ్మీర్: 1

  • పుదుచ్చేరి: 1

  • సిక్కిం: 1


ఇవి కూడా చదవండి:

Droupadi Murmu: 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నేడు జాతిని ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం


సెబీ చీఫ్‌, అదానీపై.. 22న దేశవ్యాప్త ఉద్యమం

హత్యాచారం కేసు సీబీఐకి!

Read More Education News and Latest Telugu News

Updated Date - Aug 14 , 2024 | 10:18 AM

Advertising
Advertising
<