RRB NTPC Recruitment 2024: 8000 పోస్టులకు ఈరోజే లాస్ట్ డేట్.. అప్లై చేశారా..
ABN, Publish Date - Oct 20 , 2024 | 05:52 PM
ప్రభుత్వ కొలువు కోసం ప్రయత్నించే వారికి ఓ ఆఖరి అవకాశం. 8000 పోస్టులకు ఈరోజే ఆఖరు అప్లై చేశారా
ప్రభుత్వ ఉద్యోగం అనేది చాలా మంది కల. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు దేశ వ్యాప్తంగా పోటీ ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తే వారికి, వారి కుటుంబానికి ఒక భరోసా ఉంటుంది. జీవితం ఏ బాదర బంధీ లేకుండా గడిచిపోతుందని అనుకుంటారు. ఈ కారణంతోనే నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతూ ఉంటారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం రైల్వే పోస్టుల భర్తీకి పిలుపునిస్తూ గ్రాడ్యుయేట్ చేసిన వారికోసం 8,113 పోస్టులతో నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ పోస్టులకు అప్లికేషన్స్ సెప్టెంబర్ 14వ తేదీ నుంచి ప్రారంభమవగా.. అక్టోబర్ 20వ తేదీతో దరఖాస్తు గడువు ముగిసిపోతుంది. మరి మీరు అప్లై చేశారా? లేదంటే ఇప్పటికీ సమయం మించిపోయింది లేదు. త్వరగా అప్లై చేసేయండి. ఈ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి వివరాలు మీకోసం..
మహిళలు క్రమం తప్పకుండా పాలకూర తింటే జరిగేది ఇదే..!
కేంద్ర ప్రభుత్వ కొలువు అంటే ఇష్టపడనివారు ఉండరు. ముఖ్యంగా గ్రాడ్యుయేట్ చేసి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న నిరుద్యోగులకు దేశంలో లోటు లేదు. అలాంటి వారికి అవకాశం కల్పిస్తూ కేంద్ర రైల్వే శాఖ సెప్టెంబర్ నెల 14వ తేదీన 8,113 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్టుల జాబితాలో రైల్వే స్టేషన్ మాస్టర్, గూడ్స్ రైలు మేనేజర్, టిక్కెట్ సూపర్ వైజర్, క్లర్ పోస్టులు ఉన్నాయి. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కింద రైల్వేలో పైన చెప్పుకున్న వివిధ విభాగాలలో భర్తీలు జరుగుతాయి. కాగా ఈ నోటిఫికేషన్‌కు అక్టోబర్ 20వ తేదీన అంటే ఈరోజే చివరి రోజు కావడం గమనార్హం. అర్హత ఉండి, అప్లికేషన్ చేయని నిరుద్యోగులు ఈ సదావకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఈ దరఖాస్తు ప్రక్రియ అక్టోబరు 13వ తేదీనే ముగియాల్సి ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం గడువును మరొక 7రోజులు పొడిగించింది.
రైల్వే ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ అయిన rrbapply.gov.in లో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
Arthritis: ఆర్థరైటిస్ సమస్యకు ఆయుర్వేదం చెప్పిన అదిరిపోయే చిట్కా..
ఏ పోస్టులు ఎన్నంటే..
చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్ - 1,736 పోస్టులు
స్టేషన్ మాస్టర్- 994 పోస్టులు
గూడ్స్ రైలు మేనేజర్ - 3,144 పోస్టులు
జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ - 1,507 పోస్టులు
సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ - 732 పోస్టులు
మొత్తం రిక్రూట్‌మెంట్ - 8,113 పోస్టులు
అప్లికేషన్ ఫీజు ఎంతంటే..
ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి జనరల్, OBC కేటగిరీ అభ్యర్థులకు రూ.500 ఫీజు ఉంటుంది. మొదటి దశ CBT హాజరైన తరువాత బ్యాంక్ ఛార్జీలను మినహాయించిన తర్వాత రూ.400 వెనక్కి ఇస్తారు. ఇక SC/St/PWD , మహిళలు, మాజీ సైనికులు, ట్రాన్స్ జెండర్స్, మైనారిటీ లేదా ఆర్థికంగా వెనుకబడిన తరగతుల వారికి రూ.250 ఫీజు ఉంటుంది. మొదటి దశ CBT పరీక్షకు హాజరైన తరువాత బ్యాంక్ ఛార్జీలు తీసివేసిన తరువాత మొత్తం డబ్బు తిరిగి ఇస్తారు.
ఇవి కూడా చదవండి..
Life Lesson: రిజెక్డ్ అవ్వగానే బాధపడుతున్నారా.. ఈ 5 విషయాలు తెలుసుకోండి..
ఆడవాళ్ళు తప్పనిసరిగా తీసుకోవాల్సిన ఐరన్ రిచ్ ఫుడ్స్ ఇవి..!
మరిన్ని విద్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Oct 20 , 2024 | 05:52 PM