Lok Sabha Polls: కడపలో వైఎస్ షర్మిల గెలుస్తారా?.. సీఎం రమేశ్ సమాధానం ఇదే
ABN, Publish Date - Apr 22 , 2024 | 10:03 PM
ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి సంస్థ ఎండీ వేమూరి రాధాకృష్ణ నిర్వహించిన ‘ఏబీఎన్ బిగ్ డిబేట్’లో బీజేపీ నేత, అనకాపల్లి ఎన్డీయే కూటమి అభ్యర్థి వైఎస్ వివేకా హత్య ఈ ఎఫెక్ట్‌తో కడపలో వైఎస్ షర్మిల గెలుస్తుందా అని ప్రశ్నించగా ఆయన ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. ‘‘వైఎస్ షర్మిల గెలుస్తారో లేదో తెలియదు. కానీ షర్మిల, సునీత చెప్పేదానివల్ల జగన్ మోహన్ రెడ్డికి ఖచ్చితంగా నష్టం జరుగుతుంది’’ అని అన్నారు.
ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి సంస్థ ఎండీ వేమూరి రాధాకృష్ణ నిర్వహించిన ‘ఏబీఎన్ బిగ్ డిబేట్’లో బీజేపీ నేత, అనకాపల్లి ఎన్డీయే కూటమి అభ్యర్థి వైఎస్ వివేకా హత్య ఈ ఎఫెక్ట్‌తో కడపలో వైఎస్ షర్మిల గెలుస్తుందా అని ప్రశ్నించగా ఆయన ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. ‘‘వైఎస్ షర్మిల గెలుస్తారో లేదో తెలియదు. కానీ షర్మిల, సునీత చెప్పేదానివల్ల జగన్ మోహన్ రెడ్డికి ఖచ్చితంగా నష్టం జరుగుతుంది. రాష్ట్రం మొత్తం ప్రభావం చూపుతుంది. షర్మిల, సునీత చెప్పేది రాష్ట్రవ్యాప్తంగా మహిళలు బాగా నమ్ముతున్నారు. చరిత్ర చూసినా కుటుంబంలో ఏ ఆడబిడ్డకు అన్యాయం చేసినా బాగుపడిన చరిత్రేలేదు. ఆడపిల్లల శాపం తప్పకుండా తగులుతుంది. ఈ ఘటనలో వైఎస్ వివేకాను చంపడం ఒక ఎత్తయితే.. చంపింది సొంతం కూతురేనని చెప్పడం కన్నా దారుణం మరొకటి ఉండదు. అబద్ధాలు చెప్పే విషయంలో దేనికైనా వెనుకాడరు’’ అని సీఎం రమేశ్ అన్నారు.
జగన్ దంపతుల అనుమతిలోనే వైఎస్ వివేకా హత్య జరిగిందని సీఎం రమేశ్ ఆరోపించారు. వాళ్ల అనుమతి లేకుంటే రూ.10 కోట్లు, రూ.50 కోట్లు ఇస్తామనే స్థోమత అవినాశ్ రెడ్డి వాళ్లకు ఉందా అని సందేహం వ్యక్తం చేశారు. పొలాలు, ఆస్తులు ఏమైనా ఉంటే ఉండొచ్చు కానీ ఇంత డబ్బు వారి దగ్గర లేదని అన్నారు. కోట్లకు కోట్లు డబ్బు ఇచ్చే స్థితిలో అప్పుడు వారులేరని పేర్కొన్నారు. వైఎస్ వివేకా హత్య దర్యాప్తులో వారి లాకర్‌లో డబ్బు కూడా దొరికిందని ప్రస్తావించారు. వారికి డబ్బులు ఇవ్వకుంటే జరిగే పని కాదన్నారు.
Updated Date - Apr 22 , 2024 | 10:06 PM