CM Revanth Reddy: ఖమ్మం వేదికగా కేసీఆర్‌కు రేవంత్ సవాల్..
ABN, Publish Date - May 04 , 2024 | 01:47 PM
ఖమ్మం గడ్డ పై కాంగ్రెస్ పార్టీ నీ భారీ మెజార్టీ తో గెలిపించాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. నేడు ఆయన కొత్తగూడెం జన జాతర సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. సోనియా గాంధీ.. మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ ఆశీస్సులతో రఘు రాం రెడ్డి ఖమ్మం లోక్ సభ ఎన్నికల బరిలో ఉన్నారన్నారు. గతంలో నెహ్రూ కంటే రావి నారాయణరెడ్డికి ఎక్కువ మెజార్టీ తెలంగాణలో ఇచ్చారన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం: ఖమ్మం గడ్డ పై కాంగ్రెస్ పార్టీ నీ భారీ మెజార్టీ తో గెలిపించాలని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) తెలిపారు. నేడు ఆయన కొత్తగూడెం జన జాతర సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. సోనియా గాంధీ.. మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ ఆశీస్సులతో రఘు రాం రెడ్డి ఖమ్మం లోక్ సభ ఎన్నికల బరిలో ఉన్నారన్నారు. గతంలో నెహ్రూ కంటే రావి నారాయణరెడ్డికి ఎక్కువ మెజార్టీ తెలంగాణలో ఇచ్చారన్నారు. ఖమ్మం పార్లమెంట్ భారీ మెజార్టీతో ఈసారి కూడా చరిత్రలో నిలవబోతోందన్నారు. తెలంగాణ ఉద్యమం పునాదులు వేసి ప్రపంచానికి తెలియజేసిన జిల్లా ఖమ్మం అని రేవంత్ తెలిపారు.
BRS: ఎన్నికల ముందు బీఆర్ఎస్‌కు బిగ్ షాక్... ఆ కీలక నేతతో పాటు మరికొందరు నేతల రాజీనామా
2014.. 2018.. 2023 ఎన్నికల్లో దుర్మార్గుడు అధినేతగా ఉన్న పార్టీకి మూడు సార్లు ఒక్క సీటు ఇచ్చారన్నారు. ఏ రోజు కూడా నయవంచన, నక్క బుద్ధి తప్ప మరొకటి తెలియని కేసీఅర్‌ని ఈసారి ఖమ్మం జిల్లా ప్రజలు నమ్మకుండా బండకేసి కొట్టారన్నారు. ఖమ్మం జిల్లా ప్రజలంటే ముఖ్యమంత్రులు భయపడేంత చైతన్యం ఉన్న వారన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఇప్పటికే 65 లక్షల మందికి రైతు భరోసా చెల్లించామని.. ఈనెల 8 లోగా మిగిలిన బకాయిలు చెల్లించే బాధ్యత మాదని అన్నారు. ఈ నెల 9 తర్వాత ఒక్క రైతుకైనా బకాయి ఉంటే.. అమరవీరుల స్థూపం ముందు ముక్కు నేలకు రాస్తానని తెలిపారు. రైతు భరోసా నిధులు అందితే.. కేసీఆర్ ముక్కు నేలకు రాసి క్షమాపణ చెబుతారా? అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి...
Lok Sabha Polls: క్షీణించిన తేజస్వి యాదవ్ ఆరోగ్యం.. ఎన్నికలపై ప్రభావం చూపుతుందా..!
Chennai: ఇక భగభగలే.. నేటినుంచి అగ్నినక్షత్రం ప్రారంభం
Read Latest Telangana News And Telugu News
Updated Date - May 04 , 2024 | 01:47 PM