Gold and Silver: రూ.23 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, వెండిని పట్టుకున్న ఎస్ఓటీ పోలీసులు
ABN, Publish Date - May 04 , 2024 | 09:19 AM
లోక్‌సభ ఎన్నికలకు పెద్దగా సమయం లేదు. ఈ క్రమంలోనే పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇవాళ ఎస్ఓటీ మాదాపూర్ పోలీసులు, రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు సంబంధించిన పోలీసులు సంయుక్తంగా వాహన తనఖీలు చేస్తుండగా పెద్ద ఎత్తున బంగారం, వెండి పట్టుబడింది.
హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికలకు పెద్దగా సమయం లేదు. ఈ క్రమంలోనే పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇవాళ ఎస్ఓటీ మాదాపూర్ పోలీసులు, రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు సంబంధించిన పోలీసులు సంయుక్తంగా వాహన తనఖీలు చేస్తుండగా పెద్ద ఎత్తున బంగారం, వెండి పట్టుబడింది. సరైన పత్రాలు లేకుండా 34.78 కిలోల బంగారు నగలు, 43.60 కిలోల వెండి లభ్యమైంది. సరైన పత్రాలు లేకుండా రవాణా చేస్తుండగా పట్టుకుని ఆర్జీఐ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం పట్టుబడిన బంగారాన్ని, వెండి ని ఎఫ్ఎస్‌టీ టీంకు అప్పగించారు. ఈ కేసు విచారణలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు కూడా పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి...
AP Election 2024: పిఠాపురంలో పవన్ పోటీపై ముద్రగడ కూతురు సంచలన వ్యాఖ్యలు.. జగన్‌కు ఊహించని షాక్
Hyderabad: వీళ్లు మామూలు దొంగలు కాదు.. ఏకంగా ఎస్సైనే బెదిరించి దోచుకున్నారు..
Read Latest AP News And Telugu News
Updated Date - May 04 , 2024 | 09:19 AM