ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Lok Sabha Polls 2024: తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వెళ్లిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి

ABN, Publish Date - May 01 , 2024 | 01:51 PM

లోక్‌సభ ఎన్నికలు-2024 (Lok Sabha Polls 2024) పోలింగ్ తేదీ సమీపిస్తుండడంతో అభ్యర్థులు ప్రచారాన్ని మరింత హోరెత్తించారు. మండుటెండలను లెక్క చేయకుండా ప్రచారపర్వాన్ని కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. ఖమ్మం లోక్‌సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థి రామసాయం రఘురాంరెడ్డి ఖమ్మంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వెళ్లారు.

ఖమ్మం: లోక్‌సభ ఎన్నికలు-2024 (Lok Sabha Polls 2024) పోలింగ్ తేదీ సమీపిస్తుండడంతో అభ్యర్థులు ప్రచారాన్ని మరింత హోరెత్తించారు. మండుటెండలను లెక్క చేయకుండా ప్రచారపర్వాన్ని కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. ఖమ్మం లోక్‌సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థి రామసాయం రఘురాంరెడ్డి ఖమ్మంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వెళ్లారు.


అక్కడ మాట్లాడుతూ.. తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన నేత ఎన్టీఆర్ అని కొనియాడారు. ఎన్టీఆర్ అమలు జరిపిన అభివృద్ధి సంక్షేమం నేటి పాలకులకు ఆదర్శంగా నిలుస్తోందని అన్నారు. పేదల మనిషిగా.. ప్రజల మనిషిగా ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచిపోతారని ప్రశంసల జల్లు కురిపించారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఖమ్మం నుంచి తాను ఎన్నికల బరిలో నిలిచానని అన్నారు.


అసెంబ్లీ ఎన్నికల్లో ఏవిధంగానైతే కాంగ్రెస్ అభ్యర్థులకు టీడీపీ కార్యకర్తలు మద్దతు పలికీ అండగా నిలిచారో.. లోక్‌సభ ఎన్నికల్లో అదే మద్దతు అందించాలని విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా తనకు మద్దతు ఇవ్వాలని అభ్యర్థించారు. అయితే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నిర్ణయమే తమ నిర్ణయమని టీడీపీ నేతలు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏ విధంగా అయితే వ్యవహరించామో రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కూడా అదే విధంగా వ్యవహరిస్తామని చెప్పారు.

ఇవి కూడా చదవండి...

AP Politics: జయరాం నాయుడు అరెస్ట్.. టీడీపీ నేతల ఆందోళన.. రణరంగంగా అనంత

Hyderabad: బాలాపూర్‌లో సీఎం సభ గ్రాండ్‌ సక్సెస్‌

Read Latest TS News And Telugu News

Updated Date - May 01 , 2024 | 02:10 PM

Advertising
Advertising