ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Kejriwal: వన్ నేషన్.. వన్ లీడర్ మిషన్‌ మోదీ ఉద్దేశం: కేజ్రీవాల్ విసుర్లు

ABN, Publish Date - May 11 , 2024 | 03:11 PM

ప్రధాని మోదీపై ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడటం తనను చూసి నేర్చుకోవాలని సూచించారు. తన క్యాబినెట్‌ మంత్రిపై ఆరోపణలు వస్తే జైల్లో వేశానని గుర్తుచేశారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నని చెబుతూనే దొంగలను పార్టీలో చేర్చుకుంటున్నారని కేజ్రీవాల్ విమర్శించారు.

aravind kejriwal

న్యూఢిల్లీ: ప్రధాని మోదీపై (PM Modi) ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Aravind Kejriwal) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడటం తనను చూసి నేర్చుకోవాలని సూచించారు. తన క్యాబినెట్‌ మంత్రిపై ఆరోపణలు వస్తే జైల్లో వేశానని గుర్తుచేశారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నని చెబుతూనే దొంగలను పార్టీలో చేర్చుకుంటున్నారని కేజ్రీవాల్ విమర్శించారు. ఆ దొంగలను మంత్రి, ముఖ్యమంత్రిని చేశారని వివరించారు. ప్రధాని మోదీ వన్ నేషన్, వన్ లీడర్ మిషన్‌తో పనిచేస్తున్నారని విమర్శించారు. విపక్ష నేతలను జైలులో వేసి, ఎన్నికల్లో గెలవాలని మోదీ చూస్తున్నారని మండిపడ్డారు.


దేశాన్ని కాపాడాలి..

బీజేపీలో అగ్రనేతలను కూడా పక్కన పెట్టిన ఘనుడు మోదీ అని కేజ్రీవాల్ మండిపడ్డారు. అద్వానీ, మురళి మనోహర్ జోషి, శివరాజ్ సింగ్ చౌహన్, వసుంధర రాజేల ప్రభను ఆమాంతం తగ్గించేశారని గుర్తుచేశారు. త్వరలో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి అదిత్యనాథ్‌కు కూడా అదే గతి పడుతుందని వివరించారు. ప్రధాని మోదీ నియంతలా దేశాన్ని పాలిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియంతృత్వ విధానాలను తాను వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నానని వివరించారు. ప్రధాని మోదీ కబంధ హస్తాల నుంచి దేశాన్ని కాపాడాలని 140 కోట్ల ప్రజలను కోరారు.


మరి.. మోదీ

తనకు బెయిల్ ఇచ్చినందుకు సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టుకు ధన్యవాదాలు తెలిపారు. మోదీ చేతుల నుంచి కాపాడేందుకు దేశం మొత్తం తిరుగుతానని ప్రకటించారు. బీజేపీలో 75 ఏళ్ళు నిండిన నేతలు రాజకీయాలకు దూరంగా ఉండాలనే నియమం ఉంది. ఆ నియమం పెట్టిందే మోదీ.. వచ్చే ఏడాదితో మోదీకి 75 ఏళ్ళు వస్తున్నాయి. బీజేపీ ప్రధాని అభ్యర్థి ఎవరో ఆ పార్టీ నేతలు సమాధానం చెప్పాలి. జైలు నుంచి వచ్చిన తర్వాత చాలా మంది షెఫలజిస్టులు, రాజకీయ విశ్లేషకులు, ప్రజలతో మాట్లాడాను. జూన్ 4న ఫలితాలు తారుమారు అవడం ఖాయం అన్నారు. వచ్చేది ఇండియా కూటమి ప్రభుత్వమే,ఆప్ కీలకపాత్ర పోషిస్తుందని వివరించారు.


పూర్తిస్థాయి హోదా

ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా వస్తుందని కేజ్రీవాల్ ధీమా వ్యక్తం చేశారు. ‘వచ్చే 20 ఏళ్ల వరకు ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం కొలువు దీరుతుంది. తనను ఓడించడం చేతకాక తప్పుడు కేసులో జైలుకు పంపారు. కేజ్రీవాల్‌ను జైలులో వేస్తే రాజీనామా చేస్తానని భావించారు. బీజేపీ ట్రాప్‌లో పడలే. జైలు నుంచే పాలన సాగించా. తనకు సీఎం పదవి ముఖ్యం కాదు, లాలూచీ పడాల్సిన ఖర్మ లేదు. జైల్లో ఉంటూనే మోదీ నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నా. హేమంత్ సొరేన్ రాజీనామా చేయకుండా ఉండాల్సింది అని’ అరవింద్ కేజ్రీవాల్ అభిప్రాయ పడ్డారు.



Read Latest
National News And Telugu News

Updated Date - May 11 , 2024 | 03:11 PM

Advertising
Advertising