ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Lok Sabha Polls 2024: సంచలన హామీ ఇచ్చిన ప్రధాని మోదీ

ABN, Publish Date - May 19 , 2024 | 10:08 PM

లోక్‌సభ ఎన్నికల ఐదవ దశ పోలింగ్‌కు ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంచలన హామీ ఇచ్చారు. ఇకపై అవినీతిపరులను బయట ఉండనివ్వనని, ఈ మేరకు దేశ ప్రజలకు మరో గ్యారంటీ ఇస్తున్నానని ఆయన అన్నారు. పశ్చిమ బెంగాల్‌లోని పురులియా బహిరంగ సభలో మాట్లాడుతూ మోదీ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ఐదవ దశ పోలింగ్‌కు ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంచలన హామీ ఇచ్చారు. ఇకపై అవినీతిపరులను బయట ఉండనివ్వనని, ఈ మేరకు దేశ ప్రజలకు మరో గ్యారంటీ ఇస్తున్నానని ఆయన అన్నారు. పశ్చిమ బెంగాల్‌లోని పురులియా బహిరంగ సభలో మాట్లాడుతూ మోదీ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ నేను ఇప్పుడు చెబుతున్నా.... అవినీతిపరులను జైలు బయట ఉండనివ్వను. జూన్ 4 తర్వాత మేం కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. అనంతరం అవినీతిపరులు వారి పూర్తి జీవితాన్ని జైలులోనే గడపాల్సి ఉంటుంది’’ అని అన్నారు.


రేపు నాలుగో దశ పోలింగ్...

కాగా లోక్‌సభ ఎన్నికలు-2024 ఐదవ దశకు సర్వసిద్ధమైంది. రేపు (సోమవారం) ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలోని మొత్తం 49 లోక్‌సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. ఎన్నికలను పటిష్టంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ఈ విడత ఉత్తరప్రదేశ్‌లోని 14 లోక్‌సభ, మహారాష్ట్రలో 13, బెంగా ల్‌లో 7, బిహార్, ఒడిశాలో 5, ఝార్ఖండ్ 3 స్థానాలతో పాటు జమ్మూకశ్మీర్, లద్దాఖ్‌లో ఒక్కో నియోజక వర్గానికి పోలింగ్ జరగనుంది. ఈ విడతలో 695 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

ఐదో విడతలో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 33 శాతం మంది కోటీశ్వ రులు ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం గణాంకాలు చెబుతున్నాయి. కాగా ఈ దశలో పోటీ చేస్తున్న ప్రముఖ వ్యక్తుల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాయబరేలీ, లఖ్‌నవూ నుంచి రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్, అమేథీ నుంచి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, సనర్ లోక్‌సభ స్థానం నుంచి ఆర్జేడీ అధినేత, బిహార్ మాజీ సీఎం లాలుప్రసాద్ కుమార్తె రోహిణి ఆచార్య, జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లా నుంచి నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా పోటీ చేస్తున్నారు.

Updated Date - May 19 , 2024 | 10:08 PM

Advertising
Advertising