ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Loksabha Elections 2024: ముచ్చటగా మూడోసారి అక్కడి నుంచి బరిలోకి..

ABN, Publish Date - May 14 , 2024 | 12:24 PM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారణాసి లోక్ సభ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. వరసగా మూడోసారి ఇక్కడి నుంచి మోదీ బరిలోకి దిగారు. 2019, 2014లో కూడా వారణాసి నుంచి మోదీ పోటీ చేసి గెలుపొందిన సంగతి తెలిసిందే.

pm modi

వారణాని: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారణాసి లోక్ సభ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. వరసగా మూడోసారి ఇక్కడి నుంచి మోదీ బరిలోకి దిగారు. 2019, 2014లో కూడా వారణాసి నుంచి మోదీ పోటీ చేసి గెలుపొందిన సంగతి తెలిసిందే. నామినేషన్ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, 12 రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. ఎన్డీయే భాగస్వామ్య పార్టీ టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూటమి నేతలంతా నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు.


ప్రధాని మోదీ ఈ రోజు ఉదయం దశాశ్వమేధ ఘాట్ వద్ద గంగానదికి ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి క్రూజ్‌లో నమో ఘాట్‌కు వెళ్లారు. నామినేషన్ వేసిన తర్వాత రుద్రాక్ష కన్వెన్షన్ సెంటర్‌లో పార్టీ కార్యకర్తలతో ప్రధాని మోదీ భేటీ అవుతారు. మోదీ నామినేషన్ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు, బీజేపీ నేతలు భారీగా హాజరయ్యారు.


వారణాసిలో లోక్‌సభ అభ్యర్థిగా మరోసారి పోటీచేస్తున్న నరేంద్ర మోదీ సోమవారం ఆరు కిలోమీటర్ల మేర పట్టణంలో భారీ రోడ్‌షో నిర్వహించారు. విద్యా రంగ సంస్కర్త మదన్‌మోహన్‌ మాలవీయా విగ్రహానికి పూలమాల సమర్పించి యాత్రను ప్రారంభించారు. రోడ్‌షోలో ఆయన వెంట యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌ ఉన్నారు. ప్రధానమంత్రికి ఆహ్వానం పలుకుతూ, కనీసం వంద చోట్ల స్వాగత తోరణాలు ఏర్పాటుచేశారు. కాషాయ దుస్తులు ధరించిన మహిళలు రోడ్డుకు అటు ఇటు పెద్దఎత్తున గుమిగూడి రోడ్‌షోకు స్వాగతం పలికారు. నరేంద్రమోదీపై పూలవర్షం కురిపించారు.

Updated Date - May 14 , 2024 | 12:56 PM

Advertising
Advertising