ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Election Result 2024: ఇంటిపేరు మార్చుకుంటున్నా: ముద్రగడ సంచలన ప్రకటన

ABN, Publish Date - Jun 05 , 2024 | 10:28 AM

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ దారుణంగా ఓటమి పాలైంది. దీంతో ఎన్నికల ప్రచార సమయంలో సవాళ్లు విసిరిన ఆ పార్టీ సీనియర్ ఇప్పుడు సైలెంట్ అయ్యారు. ఎక్కడా.. ఎవరి మాటా.. వినిపించడం లేదు. అయితే ప్రచారం సమయంలో అతికి పోయి సవాల్ చేసిన వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం సంచలన ప్రకటన చేశారు.

Mudragada Padmanabham

కాకినాడ: ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ దారుణంగా ఓటమి పాలైంది. దీంతో ఎన్నికల ప్రచార సమయంలో సవాళ్లు విసిరిన ఆ పార్టీ సీనియర్ ఇప్పుడు సైలెంట్ అయ్యారు. ఎక్కడా.. ఎవరి మాటా.. వినిపించడం లేదు. అయితే ప్రచారం సమయంలో అతికి పోయి సవాల్ చేసిన వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం సంచలన ప్రకటన చేశారు.


‘‘ఎన్నికల ప్రచారంలో చెప్పినట్టుగానే నా ఇంటిపేరు మార్చుకుంటున్నా ’’ అంటూ ప్రకటన చేశారు. ముద్రగడ పద్మనాభ రెడ్డిగా పేరు మార్పు కోసం గెజిట్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నానని తెలిపారు. ఇవిగో గెజిట్ కోసం దరఖాస్తు చేసుకున్న పత్రాలు అంటూ ఆయన చూపించారు. ఈ మేరకు ముద్రగడ పద్మనాభం బుధవారం ఒక వీడియో విడుదల చేశారు. పిఠాపురంలో పవన్ కల్యాణ్‌ను ఓడించలేనందుకు చింతిస్తున్నానని వీడియోలో పేర్కొన్నారు.


సంక్షేమానికి ప్రజలు ఓటు వేయలేదని ముద్రగడ పద్మనాభం వ్యాఖ్యానించారు. దీంతో భవిష్యత్తులో ఏ ప్రభుత్వమూ సంక్షేమం అమలు చేయని పరిస్థితిని ఓటర్లు తెచ్చారని అభిప్రాయపడ్డారు.

కాగా ఎన్నికల ప్రచారం సమయంలో వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం సవాల్ విసిరిన విషయం తెలిసిందే. పిఠాపురంలో పవన్ కల్యాణ్‌ను ఓడించకపోతే పేరు మార్చుకుంటానని, తన పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని అన్నారు.

Updated Date - Jun 05 , 2024 | 12:16 PM

Advertising
Advertising