Loksabha Polls 2024: తెలంగాణలోని 17 పార్లమెంటు స్థానాల పరిధిలో కొత్త సమయం..
ABN, Publish Date - May 02 , 2024 | 09:18 AM
తెలంగాణలో పోలింగ్ సమయాల్లో మార్పు చేస్తూ ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధికారికంగా గెజిట్‌ను విడుదల చేసింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. తెలంగాణలోని 17 పార్లమెంటు స్థానాల పరిధిలో కొత్త సమయాన్ని అమలు చేసేందుకు గెజిట్ విడుదల చేసింది.
ఢిల్లీ: తెలంగాణలో పోలింగ్ సమయాల్లో మార్పు చేస్తూ ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధికారికంగా గెజిట్‌ను విడుదల చేసింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. తెలంగాణలోని 17 పార్లమెంటు స్థానాల పరిధిలో కొత్త సమయాన్ని అమలు చేసేందుకు గెజిట్ విడుదల చేసింది. రాష్ట్రంలో ఎండాకాలం, వేడిగాలులు వీస్తున్న నేపథ్యంలో పోలింగ్ సమయాన్ని పెంచుతూ ఈసీ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో నెలకొన్న వాతావరణ పరిస్థితుల కారణంగా.. పోలింగ్ సమయాన్ని పెంచాలని పలు రాజకీయ పార్టీలు, పోటీలో ఉన్న అభ్యర్థులు కోరారు.
CBI: జగన్ అక్రమాస్తుల కేసులో పలు కీలక అంశాలు వెల్లడించిన సీబీఐ
వారందరి నుంచి విజ్ఞాపనలు పరిగణనలోకి తీసుకుని మొత్తం 17 పార్లమెంటరీ నియోజకవర్గాల్లోని కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో పోలింగ్ గంటల వ్యవధిని పెంచాలని ఈసీకి తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి నివేదించడం జరిగింది. తెలంగాణ సీఈఓ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుని పోలింగ్ గంటల్లో మార్పు చేసినట్లు ఈసీ పేర్కొంది. ఓటర్ల భాగస్వామ్యాన్ని పెంచేందుకు, తెలంగాణలోని మొత్తం 17 పార్లమెంటరీ నియోజకవర్గాల్లోని షెడ్యూల్‌లో పేర్కొన్న అసెంబ్లీ సెగ్మెంట్లలో పోలింగ్ గంటలను పెంచాలని నిర్ణయించినట్లు గెజిట్‌లో ఈసీ పేర్కొంది.
TG: కాంగ్రెస్ గూటికి ఇంద్రకరణ్‌రెడ్డి
Medak: బీజేపీని ఓడించడమే ఏకైక లక్ష్యం కావాలి: కోదండరాం
Read Latest Telangana News And Telugu News
Updated Date - May 02 , 2024 | 09:18 AM