AP Elections 2024: ఏపీలో వారికి నో పోస్టల్ బ్యాలెట్.. అరిచి గీ పెట్టినా ఇవ్వట్లే..
ABN, Publish Date - May 06 , 2024 | 01:37 PM
ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులెవరైనా పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకోవచ్చు. కానీ ఏపీలో అవన్నీ కుదరవు. దేశంలో ఎన్నికల విధుల్లో పని చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవచ్చు కానీ ఏపీ నుంచి ఎన్నికల బందోబస్తుకు మహారాష్ట్రకు వెళ్ళిన స్పెషల్ పోలీస్‌లకు మాత్రం నో పోస్టల్ బ్యాలెట్. అరిచి గీ పెట్టినా ఓటు హక్కు కల్పించారు.
అమరావతి: ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులెవరైనా పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకోవచ్చు. కానీ ఏపీలో అవన్నీ కుదరవు. దేశంలో ఎన్నికల విధుల్లో పని చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవచ్చు కానీ ఏపీ నుంచి ఎన్నికల బందోబస్తుకు మహారాష్ట్రకు వెళ్ళిన స్పెషల్ పోలీస్‌లకు మాత్రం నో పోస్టల్ బ్యాలెట్. అరిచి గీ పెట్టినా ఓటు హక్కు కల్పించారు. మహారాష్ట్రలోని మొదటి దశ ఎన్నికలకు బందోబస్తు, ఆ తరువాత మూడో దశ పోలింగ్‌కు ఏపీఎస్‌పీ బెటాలియన్ దళాలు బందోబస్తు కు వెళ్లాయి.
Loksabha Polls: మీ ఓటు మరొకరు వేశారా..? ఇలా చేయండి..!!
990 మంది పోలీస్‌లు ఆరు బెటాలియన్‌ల నుంచి వెళ్లారు. తమకు ఓటు హక్కు కల్పించాలని తమ ఉన్నతాధికారులకు పలుమార్లు విజ్ఞప్తి చేశారు. బందోబస్తుకు పంపే ముందు మీకు పోస్టల్ బ్యాలెట్ పంపుతామని అధికారులు చెప్పి పంపారు. కానీ అక్కడకు వెళ్ళిన తరువాత పలుమార్లు అడిగినా స్పందించడం లేదు. రాష్ట్ర సీఈఓకు, కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా విజ్ఞప్తులు చేశారు. ఎవరూ పట్టించుకోవడం లేదని స్పెషల్ పోలీస్‌లు ఆగ్రహం వ్యక్తం చేశారు. నేరుగా కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్‌కు బలగాలు ఫిర్యాదు చేశారు. ఎన్నికల కమిషన్ రాష్ట్ర సీఈఓ స్పందించాలని బలగాలు కోరుతున్నాయి.
ఇవి కూడా చదవండి...
Pawan Kalyan: పవన్‌తో పాటు మెగా ఫ్యామిలీపై ముద్రగడ సంచలన వ్యాఖ్యలు
YS Sharmila: జగన్‌ను పైసా సాయం అడగలే, నిరూపిస్తే రాజకీయాలకు గుడ్ బై చెబుతా..!!
Read Latest AP News And Telugu news
Updated Date - May 06 , 2024 | 01:37 PM