ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

PM Modi: సందేశ్ ఖాళి బాధితురాలు రేఖ.. శక్తి స్వరూపిణి అని మోదీ ప్రశంసలు

ABN, Publish Date - Mar 26 , 2024 | 06:20 PM

సందేశ్ ఖాళిలో తృణమూల్ కాంగ్రెస్ నేత షేక్ షాజహన్, అతని అనుచరుల ఆగడాలతో అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమించిన సంగతి తెలిసిందే. వేధింపుల గురించి రేఖ పాత్ర అనే మహిళ ప్రపంచానికి చాటారు. ఇటీవల పశ్చిమ బెంగాల్‌లో పర్యటించిన ప్రధాని మోదీ రేఖ పాత్రతో సమావేశం అయ్యారు. తర్వాత బరాసత్ లోక్ సభ బీజేపీ అభ్యర్థిగా రేఖ పాత్రకు అవకాశం ఇచ్చారు.

ఢిల్లీ: సందేశ్ ఖాళిలో తృణమూల్ కాంగ్రెస్ నేత (TMC) షేక్ షాజహన్, అతని అనుచరుల ఆగడాలతో అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమించిన సంగతి తెలిసిందే. వేధింపుల గురించి రేఖ పాత్ర అనే మహిళ ప్రపంచానికి చాటారు. ఇటీవల పశ్చిమ బెంగాల్‌లో పర్యటించిన ప్రధాని మోదీ రేఖ పాత్రతో సమావేశం అయ్యారు. తర్వాత బరాసత్ లోక్ సభ బీజేపీ అభ్యర్థిగా రేఖ పాత్రకు అవకాశం ఇచ్చారు. రేఖ పాత్రకు మంగళవారం నాడు ప్రధాని మోదీ (PM Modi) ఫోన్ చేశారు. ఎన్నికల్లో ప్రచారం, బీజేపీకి ప్రజల నుంచి వస్తోన్న మద్దతు, ఇతర అంశాల గురించి మాట్లాడారు. ఈ క్రమంలో రేఖ పాత్రను ప్రధాని మోదీ శక్తి స్వరూపిణి అని కొనియాడారు.

పాత్ర ఏమన్నారంటే..?

‘సందేశ్ ఖాళిలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రధాని మోదీతో రేఖ పాత్ర చర్చించారు. నియోజకవర్గంలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సవాళ్ల గురించి వివరించారు. ‘2011 నుంచి సందేశ్ ఖాళిలో పరిస్థితి ఏ మాత్రం బాగోలేదు. ఇక్కడి ప్రజలకు ఓటు వేసే స్వేచ్చ ఇస్తే చాలు. ప్రస్తుత పరిస్థితి మొత్తం మారిపోతుంది. ఇక్కడి ప్రజల గౌరవాన్ని తాను కాపాడాలని అనుకుంటున్నా అని’ రేఖ పాత్ర ప్రధాని మోదీకి వివరించారు. తమ సమస్యలపై పోరాటం కొనసాగుతోందని రేఖ స్పష్టం చేశారు.

రేఖ పాత్ర ఎవరంటే..?

సందేశ్ ఖాళిలో గల పత్రపరాలో రేఖ పాత్ర నివసిస్తున్నారు. టీఎంసీ ఎమ్మెల్యే షేక్ షాజహాన్, అతని అనుచరులు పలువురిని లైంగిక వేధింపులకు గురిచేశారు. దాంతో మొదలైన ప్రజా ఉద్యమంలో రేఖ పాత్ర పాల్గొన్నారు. షేక్ షాజహాన్ అండ్ కో ఆగడాల గురించి ప్రపంచానికి తెలియజేశారు. సర్వత్రా విమర్శలు రావడంతో షాజహన్‌ను టీఎంసీ పార్టీ సస్పెండ్ చేసింది. ఈ నెల 6వ తేదీన బరాసత్‌లో ప్రధాని మోదీ పర్యటించారు. ఆ సమయంలో సందేశ్ ఖాళిలో తాము ఎదుర్కొన్న సమస్యలను ప్రధాని మోదీకి వివరించిన మహిళల్లో రేఖ పాత్ర ఉన్నారు. అలా లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రేఖ పాత్రకు కలిగింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 26 , 2024 | 09:43 PM

Advertising
Advertising