CP Srinivareddy: హైదరాబాద్ పోలీసుల నుంచి క్విక్ రియాక్షన్ టీమ్స్
ABN, Publish Date - May 06 , 2024 | 01:56 PM
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 13,500 మంది పోలీసులు, సీఏపీఎఫ్ నుంచి 13, సీఆర్‌పీఎఫ్ నుంచి 22 కంపెనీలు ఎన్నికల బందోబస్తులో ఉంటారని సీపీ శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. పోలింగ్ రోజు క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ వద్ద సెంట్రల్ బలగాలను వాడుతామన్నారు. అసెంబ్లీ ఎలక్షన్స్‌కి ఇచ్చిన కంటే తక్కువ సెంట్రల్ బలగాలు ఈసారి హైదరాబాద్‌కి వచ్చాయన్నారు. మరిన్ని బలగాలను పంపాలని కోరామన్నారు.
హైదరాబాద్: హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 13,500 మంది పోలీసులు, సీఏపీఎఫ్ నుంచి 13, సీఆర్‌పీఎఫ్ నుంచి 22 కంపెనీలు ఎన్నికల బందోబస్తులో ఉంటారని సీపీ శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. పోలింగ్ రోజు క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ వద్ద సెంట్రల్ బలగాలను వాడుతామన్నారు. అసెంబ్లీ ఎలక్షన్స్‌కి ఇచ్చిన కంటే తక్కువ సెంట్రల్ బలగాలు ఈసారి హైదరాబాద్‌కి వచ్చాయన్నారు. మరిన్ని బలగాలను పంపాలని కోరామన్నారు. పోలింగ్ స్టేషన్స్, పోలింగ్ లొకేషన్స్ వద్ద బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. ఎఫ్ఎస్‌టీ, ఎస్ఎస్‌టీ టీమ్స్ నోటిఫికేషన్ వచ్చిన నుంచి నడుస్తున్నాయని శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.
AP Elections: ఒకరికొకరు ఎదురైన కూటమి అభ్యర్థి, వైసీపీ అభ్యర్థి.. నవ్వుతూ కరచాలనం.. ఎక్కడంటే?
హైదరాబాద్ పోలీసుల నుంచి క్విక్ రియాక్షన్ టీమ్స్ కూడా పని చేస్తున్నాయని తెలిపారు. 85 మంది ఏసీపీలకు ప్రత్యేక టీమ్స్ ఉన్నాయని శ్రీనివాసరెడ్డి తెలిపారు. పోలింగ్ రోజు ఈ టీమ్స్ పని చేస్తాయన్నారు. 192 లా అండ్ ఆర్డర్ పికెట్స్ ఏర్పాటు చేస్తామన్నారు పోలింగ్ రోజు పికెట్స్ పని చేస్తాయన్నారు. స్ట్రాంగ్ రూమ్స్ వద్ద మూడు లేయర్ల బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. ఎన్నికల కోడ్ వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకూ రూ.18 కోట్ల అక్రమ నగదుని పట్టుకున్నామన్నారు. రూ.12 కోట్ల విలువైన బంగారం, ఇతర వస్తువులను పట్టుకున్నామని నగర సీపీ శ్రీనివాస రెడ్డి తెలిపారు.
MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు చుక్కెదురు
అమిత్ షా మార్ఫింగ్ వీడియోపై..
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మార్ఫింగ్ వీడియో.. సోషల్ మీడియాలో సర్కులేషన్‌పై అందిన ఫిర్యాదుపై 27 కేసులు నమోదు చేశామని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆ కేసులో ఐదుగురిని అరెస్ట్ చేశామన్నారు. ప్రస్తుతం వారు కండిషన్ బెయిల్‌పై బయటికి వచ్చారన్నారు. వాళ్ళ దగ్గర నుంచి సెల్ ఫోన్స్, లాప్‌ట్యాప్స్ సీజ్ చేశామన్నారు. ట్విట్టర్‌కు లెటర్ పెట్టి వివరాలు తెలుసుకున్నామన్నారు. మొదట ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందనే వివరాలు వచ్చాయని.. దానిని బట్టి విచారణ జరుపుతున్నామన్నారు. ఇదే కేసులో ఢిల్లీ పోలీసులు మమ్మల్ని కలిశారన్నారు. ఇక్కడ నమోదైన ఎఫైర్ డీటెయిల్స్ అడిగ్గా.. వారికి కావలసిన వివరాలు అందించామని.. కేసు దర్యాప్తు జరుగుతోందని శ్రీనివాసరెడ్డి తెలిపారు.
ఇవి కూడా చదవండి...
Pawan Kalyan: పవన్‌తో పాటు మెగా ఫ్యామిలీపై ముద్రగడ సంచలన వ్యాఖ్యలు
YS Sharmila: జగన్‌ను పైసా సాయం అడగలే, నిరూపిస్తే రాజకీయాలకు గుడ్ బై చెబుతా..!!
Read Latest AP News And Telugu news
Updated Date - May 06 , 2024 | 01:56 PM