Black Chickpeas: నల్ల శనగలు ఇలా తిని చూడండి.. ఎంత ఈజీగా బరువు తగ్గుతారంటే..!
ABN, Publish Date - Jun 29 , 2024 | 01:26 PM
నల్ల శనగలలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఫైబర్ తో పాటూ ఇతర పోషకాలు కూడా ఉంటాయి. ఈ కారణంగా శాకాహారులు ప్రోటీన్ కోసం వీటిని ఎంచుకుంటూ ఉంటారు. సాధారణ శనగలు, కాబులి శనగలు, నల్ల శనగలు.. ఉన్నాయి. వీటిలో నల్ల శనగలు బరువు తగ్గడానికి సహాయపడతాయట..
శనగలు ఆరోగ్యకరమైన ప్రోటీన్ పదార్థం. వీటిని ఉడికించి కూరల్లోనూ, స్నాక్స్ లానూ తింటారు. మరికొందరు వేయించిన శనగలు తింటారు. ఇంకొందరు శనగలను మెత్తని పొడిగా చేసి సత్తు రూపంలో తీసుకుంటారు. వీటిలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఫైబర్ తో పాటూ ఇతర పోషకాలు కూడా ఉంటాయి. ఈ కారణంగా శాకాహారులు ప్రోటీన్ కోసం వీటిని ఎంచుకుంటూ ఉంటారు. సాధారణ శనగలు, కాబులి శనగలు, నల్ల శనగలు.. ఉన్నాయి. వీటిలో నల్ల శనగలు బరువు తగ్గడానికి సహాయపడతాయట. నల్ల శనగలలో ఉండే పోషకాలు ఏంటో.. వీటిని ఎలా తింటే బరువు తగ్గుతారో తెలుసుకుంటే..
Indigestion: అజీర్తి వేధిస్తోందా? ఈ టిప్స్ తో తొందరగా తగ్గించేయచ్చు..!
నల్ల శనగలు తినడం వల్ల శరీరానికి ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్, గుండెకు అవసరమైన ఆరోగ్యకరమైన కొవ్వులు అందుతాయి. వీటిలో విటమిన్ ఎ, బి6, సి, కె, మాంగనీస్, కాపర్ వంటి ఖనిజాలు ఉంటాయి.
నల్ల శనగలను స్నాక్స్ రూపంలోనూ, సలాడ్లు, కూరల్లోనూ, సూప్ ల తయారీలోనూ తీసుకోవచ్చు. అయితే బరువు తగ్గాలని అనుకునేవారు మాత్రం నల్లశనగలు ఇలా తీసుకోకూడదు.
Immunity Herbs: ఈ 8 మూలికలు వాడండి చాలు.. వర్షాకాలంలో రోగనిరోధకశక్తి బలపడుతుంది..!
బరువు తగ్గాలని అనుకునేవారు నల్ల శనగలను మొలకలు వచ్చాక తినాలి. ఇందుకోసం ఉదయాన్నే శనగలు నానబెట్టాలి. రాత్రి సమయంలో శనగలను నీటినుండి తీసి నూలు వస్త్రంలో గట్టిగా మూట కట్టి వెచ్చని ప్రదేశంలో ఉంచి మూత పెట్టాలి. ఉదయానికల్లా శనగలు మొలకలు వస్తాయి. మొలకలు మరింత బాగా రావాలంటే ఒక రోజంతా మూటలోనే ఉంచాలి.
మొలకెత్తిన శనగలు తింటే జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది. ఇది గట్ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కడుపులో మంటను తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడుతుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
Yoga: 30రోజులు.. ఈ రెండు యోగాసనాలు వేసి చూడండి.. మీ ఫిట్‌నెస్ ఎంత మెరుగవుతుందంటే..!
Bronze Massage: అరికాళ్లకు కాంస్య పాత్రతో మసాజ్ చేస్తే ఈ సమస్యలన్నీ మాయం..!
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Jun 29 , 2024 | 01:29 PM