ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Brain Health: జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరగాలంటే రోజూ పరగడుపున ఇవి తినండి!

ABN, Publish Date - Apr 06 , 2024 | 04:45 PM

రోజూ పరగడుపున వాల్‌నట్స్ తింటే జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతుందని పౌష్టికాహార నిపుణులు చెబుతున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరగాలంటే ఏం తినాలి అని చాలా మందికి డౌట్ ఉండే ఉంటుంది. ఇక ఎదిగే వయసులో పిల్లల మెదడుకు మేలు (Brain Health) చేసే ఆహారం అందించడమూ కీలకమే. ఇందుకు ఉపయుక్తమైన ఆహారం వాల్‌నట్స్ అని పౌష్టికాహార నిపుణులు చెబుతున్నారు.

న్యూట్రిషనిస్టుల ప్రకారం వాల్ నట్స్ (Walnuts).. పోషకాల భాండాగారం. యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేషన్ ప్రయోజనాలు కలిగించే ఎన్నో పదార్థాలు వాల్‌నట్స్‌లో ఉంటాయి. ప్రతి రోజూ ఉదయాన్నే వాల్ నట్స్ తింటే మెదడుకు ఎంతో ఉపయోగమని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు (Eat walnuts on Empty stomach in morning).

Olive Oil: ప్రతి రోజూ ఆలివ్ ఆయిల్‌ ఫుడ్స్ తింటే ఎన్ని ఉపయోగాలో తెలుసా?

వాల్‌నట్స్‌తో మెదడు పనితీరు మెరుగవుతుందని గతంలో అనేక అధ్యయనాలు రుజువు చేశాయి. ముఖ్యంగా కొత్త విషయాలను త్వరిత గతిన అర్థం చేసుకునే సామర్థ్యం (Cognitive Abilities), జ్ఞాపకశక్తి (Memory), ఏకాగ్రత (Concentration) వంటివి ఇనుమడిస్తాయి. వయసుతో పాటూ వచ్చే మతిమరుపు బారిన పడకుండా వాల్‌నట్స్ రక్షిస్తాయి. మూడ్‌ను మెరుగుపరిచి డిప్రెషన్ వంటి సమస్యలను దరిచేరనీయవు.


రోజుకు కనీనం 5 నుంచి 8 వాల్ నట్స్ తినాలని నిపుణులు చెబుతున్నారు. రాత్రంతా నీళ్లల్లో నానబెట్టిన వాటిని ఉదయాన్నే పరగడుపున తినాలట. ఇలా నానబెట్టినవి సాయంత్రం వేళ తిన్నా మంచి ఫలితాలే వస్తాయట. ఇక వేయించినవి కాస్త రుచిగా ఉన్నప్పటికీ వాటిలో పోషకాల శాతం కాస్త తక్కువగా ఉంటుందని చెబుతున్నారు. అయితే, వాల్‌నట్స్‌ను పరగడుపున తింటేనే పూర్తి ప్రయోజనాలు చేకూరతాయని నిపుణులు చెబుతున్నారు.

Kidney Cancer: కిడ్నీ క్యాన్సర్‌ బారినపడే ముందు శరీరంలో కనిపించే మార్పులు! అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు..

వాల్‌నట్స్‌తో ఎన్ని ఉపయోగాలు ఉన్నా వీటిని పరిమితంగానే తినాలని కూడా హెచ్చరిస్తున్నారు. వీటిల్లో కెలొరీలు, కొవ్వులు అధికంగా ఉంటాయి కాబట్టి అతిగా తింటే బరువు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. వాల్‌నట్స్‌తో ఆశించిన ప్రయోజనాలు చేకూరాలంటే మంచి నాణ్యత కలిగిన, క్రిమిసంహారకాలు, ఇతర రసాయనాలు లేని ఆర్గానిక్ వాల్‌నట్స్‌ను ఎంచుకోవాలని అంటున్నారు. అయితే, మెదడుకు అన్ని పోషకాలూ అందాలంటే మాత్రం వాల్‌నట్స్‌ పాటూ సమతుల ఆహారం తీసుకోవాలని చెబుతున్నారు.

Sugar Facts: చక్కెర గురించి ఎవరైనా ఇలా చెబితే అస్సలు నమ్మొద్దు!

మరిన్ని వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Apr 06 , 2024 | 04:48 PM

Advertising
Advertising