ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Food Tips: రోజూ ఆహారంలో సలాడ్ తీసుకుంటే ఏం జరుగుతుంది? ఆహార నిపుణులు ఏం చెప్పారంటే..!

ABN, Publish Date - Oct 02 , 2024 | 07:38 PM

ఆరోగ్య స్పృహ పెరిగే కొద్దీ చాలామంది ఆహారంలో సలాడ్ తీసుకుంటున్నారు. ప్రతిరోజూ ఆహారంలో సలాడ్ చేర్చుకుంటే జరిగేది ఇదే..

Food Tips

ఆరోగ్యకరమైన ఆహారం శరీరాన్ని ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంచుతుంది. ఎంపిక చేసుకోవాలే కానీ ఆరోగ్యకరమైన ఆహారాలు చాలానే ఉంటాయి. ముఖ్యంగా ఆహారం మీద స్పృహ పెరిగేకొద్ది చాలామంది తాము తీసుకునే ఆహారం జాబితాలో సలాడ్ ను చేర్చుకుంటున్నారు. సలాడ్ లో పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు అన్నీ తినదగినవి ఉంటాయి. ప్రతి రోజూ ఆహారంలో సలాడ్ ను చేర్చుకోవడం వల్ల ఏం జరుగుతుందో ఆహార నిపుణులు స్పష్టంగా తెలిపారు. వాటి గురించి తెలుసుకుంటే..

బరువు..

సలాడ్ లో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉంచుతాయి. దీని వల్ల రోజూ సలాడ్ తీసుకుంటూ ఉంటే బరువు తగ్గడంలో సహాయపడుతుంది. అధిక బరువు ఉన్నవారు రోజూ సలాడ్ తింటే ఈజీగా బరువు తగ్గవచ్చు.

Hair Care: తెల్ల జుట్టు, జుట్టు రాలడం సమస్యలు మీకూ ఉన్నాయా? యోగా మాస్టర్ చెప్పిన ఈ టిప్స్ ట్రై చేసి చూడండి..!


చక్కెర స్థాయిలు..

సలాడ్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. మధుమేహాం ఉన్నవారు ప్రతిరోజూ ఆహారంలో సలాడ్ తీసుకుంటూ ఉంటే చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. సాధారణ వ్యక్తులు రోజూ సలాడ్ తీసుకుంటూ ఉంటే మధుమేహం రాకుండా జాగ్రత్త పడవచ్చు.

రోగనిరోధక శక్తి..

సలాడ్ లో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడతాయి. రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్నవారు ప్రతిరోజూ సలాడ్ తీసుకోవడం మంచిది.

హైడ్రేట్..

సలాడ్ లో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా దోసకాయ, టమోటా, ముల్లంగి వంటి వాటిలో నీటి శాతం ఎక్కువ. ప్రతిరోజూ సలాడ్ లో భాగంగా వీటిని తీసుకుంటూ ఉంటే శరీరం హైడ్రేట్ గా ఉంటుంది.

Health: రోజూ తినే ఈ 5 ఆహారాలు నరాలకు విషం కంటే తక్కువ కాదు.. అవేంటో తెలిస్తే షాకవుతారు..!


చర్మం..

సలాడ్ లలో విటమిన్-సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మానికి చాలా మేలు చేస్తాయి. చర్మం కాంతివంతంగా, మృదువుగా ఉండటంలో సహాయపడతాయి.

గుండె..

తాజా ఆకుకూరలు, కూరగాయలను సలాడ్ లో భాగంగా తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం బాగుంటుంది. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఉంటే కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడతాయి.

జీర్ణక్రియ..

సలాడ్ లలో అధిక మొత్తంలో పైబర్ ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. మలబద్దకం నుండి ఉపశమనం కలిగిస్తుంది. మలబద్దకం, జీర్ణ సంబంధ సమస్యలు ఉన్నవారు రోజులో కనీసం ఓ చిన్న కప్పు సలాడ్ తీసుకుంటే మంచిది.

ఇవి కూడా చదవండి..

మార్భర్గ్ వైరస్.. కరోనా, మంకీ పాక్స్ కంటే ఇదెంత డేంజరంటే..!

10గ్రాముల బంగారం ధర లక్ష దాటుతుందా? నిపుణులు ఏం చెబుతున్నారంటే..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Oct 02 , 2024 | 07:38 PM