ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Ghee: స్వచ్చమైన నెయ్యిని ఎలా గుర్తించాలి.. తిరుపతి లడ్డులో కల్తీ నెయ్యి వెనుక బయటపడిన నిజాలేంటి

ABN, Publish Date - Sep 21 , 2024 | 03:48 PM

నెయ్యికి ఆయుర్వేదంలో చాలా ప్రాధాన్యత ఉంది. స్వచ్చమైన నెయ్యి బోలెడు రోగాలను నయం చేస్తుంది.

Ghee Purity

నెయ్యి భారతీయుల ఆహారంలో ప్రధాన భాగం. ఆయుర్వేదంలో నెయ్యికి చాలా ప్రాధాన్యత ఉంది. సంస్కృతంలో నెయ్యిని ఘృతం అని అంటారు. నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇది శరీరానికి పుష్టిని ఇస్తుంది. తీసుకునే విధానాన్ని బట్టి అద్బుతమైన ఫలితాలు కూడా ఇస్తుంది. స్వచ్చమైన నెయ్యి బోలెడు రోగాలను నయం చేస్తుంది కూడా. నెయ్యిని ముఖ్యంగా తీపి పదార్థాల తయారీకి ఉపయోగిస్తారు. తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి అనే వివాదం నడుస్తున్న నేపథ్యంలో అసలు స్వచ్చమైన నెయ్యిని ఎలా గుర్తించాలి? తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వెనుక బయటపడిన నిజాలేంటి? తెలుసుకుంటే..

Hair Care: వంటింట్లో ఉన్న ఈ ఒక్క పదార్థం వాడితే చాలు.. జుట్టు ఎంత ఆరోగ్యంగా మారుతుందంటే..!


తిరుపతి లడ్డూ..

ప్రపంచ వ్యాప్తంగా తిరుమల వెంకటేశ్వర స్వామికి భక్తులున్నారు. అదే విధంగా శ్రీవారి లడ్డూ ప్రసాదానికి ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. అయితే తిరుపతి లడ్డూ తయారీకి ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉత్పత్తులు ఉన్నాయని కొన్ని నివేదికలు బయటకు వచ్చాయి. లడ్డూ తయారీలో వాడిన నెయ్యిలో కొబ్బరి, లిన్సీడ్, రాప్ సీడ్, పత్తి గింజల నుండి, కూరగాయల నూనెల నుండి సేకరించిన కొవ్వులతో పాటూ పంది కొవ్వు, గొడ్డు మాంసం కొవ్వు, చేప నూనెతో సహా విదేశీ కొవ్వులు కూడా ఉన్నట్టు చెబుతున్నారు.

Health Tips: సూజీ, రవ్వకు తేడా ఏంటి? ఏది ఎక్కువ ఆరోగ్యమంటే..!


కల్తీ నెయ్యి ఇలా గుర్తించాలి..

సువాసన..

స్వచ్చమైన నెయ్యి ప్రత్యేకరమైన వాసన కలిగి ఉంటుంది. ఇది వేడి చేసినప్పుడు వాసన అధికం అవుతుంది. కృత్రిమ లేదా కల్తీ నెయ్యిలో వాసన ఉండదు.

రంగు..

అసలైన ఆవు నెయ్యి లేత బంగారు పసుపు రంగులో ఉంటుంది. కృత్రిమ నెయ్యి లేదా కల్తీ నెయ్యి రంగులో తేడాగా కనిపిస్తుంది. అలాగే స్వచ్చమైన నెయ్యి చూడగానే ప్రకాశవంతంగా ఉంటుంది.

ఆకృతి..

స్వచ్చమైన నెయ్యి గది ఉష్ణోగ్రత వద్ద క్రీమ్ లాగా మృదువుగా ఉంటుంది. ఫ్రిజ్ లో ఉంచినప్పుడు కొద్దిగా గడ్డకడుతుంది. కానీ దాన్ని కరిగిస్తే సులువుగా కరుగుతుంది.

Weight Loss: డైట్, జిమ్ కాదు.. ఈ టిప్స్ పాటిస్తే చాలు స్లిమ్ గా అవుతారు..!


స్పష్టత..

నెయ్యి స్వచ్చంగా ఉందా లేదా అనేది చెక్ చేయడానికి ఒక పాన్ లో కొంచెం నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి అడుగున ఎలాంటి అవక్షేపాలు లేకపోతే అది స్వచ్చమైనది. అవక్షేపాలు ఉంటే నెయ్యి కల్తీది.

చల్లని వాతావరణం..

స్వచ్చమైన నెయ్యిని ఫ్రిజ్ లో ఉంచితే అది గడ్డకడుతుంది. గది ఉష్ణోగ్రత వద్ద ఉంచితే అది మృదువుగా మారుతుంది. కానీ ఫ్రిజ్ ఉంచినా కూడా ద్రవంగా ఉంటే అందులో ఇతర నూనెలు లేదా కొవ్వులు ఉండే అవకాశం ఉండవచ్చు.

ఇవి కూడా చదవండి..

కర్పూరం కలిపిన ఆవనూనె ఎంత పవరో తెలుసా..!

రోజూ ఒక స్పూన్ నువ్వులు తింటే ఈ సమస్యలు ఉన్నవారికి భలే లాభాలు..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Sep 21 , 2024 | 05:02 PM