ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hair Care Tips: నెయ్యితో ఇలా చేస్తే జుట్టు సమస్యలన్నీ పరార్..!

ABN, Publish Date - Jul 01 , 2024 | 04:12 PM

Hair Care Tips in Telugu: చాలా మంది తమ జుట్టును అందంగా, పొడవుగా, ఒత్తుగా ఉండేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరైతే వైద్యులను కూడా సంప్రదిస్తారు. కానీ, ఎలాంటి ప్రయోజనం లేక నిస్సహాయంతో ఉండిపోతారు. అలాంటి వారికోసమే ఆయుర్వేద నిపుణులు మంచి హోమ్ రెమిడీని చెబుతున్నారు. ఇంట్లో నిత్యం వినియోగించే పదార్థాలతోనే..

Haircare Tips

Hair Care Tips in Telugu: చాలా మంది తమ జుట్టును అందంగా, పొడవుగా, ఒత్తుగా ఉండేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరైతే వైద్యులను కూడా సంప్రదిస్తారు. కానీ, ఎలాంటి ప్రయోజనం లేక నిస్సహాయంతో ఉండిపోతారు. అలాంటి వారికోసమే ఆయుర్వేద నిపుణులు మంచి హోమ్ రెమిడీని చెబుతున్నారు. ఇంట్లో నిత్యం వినియోగించే పదార్థాలతోనే జుట్టును దృఢంగా, ఆరోగ్యంగా మార్చుకోవచ్చని చెబుతున్నారు. మరి ఆ హోమ్ రెమిడీస్ ఏంటో తెలుసుకుందాం..


అలోవెరా జెల్, నెయ్యి..

ఆయుర్వేదం ప్రకారం.. నెయ్యి జుట్టుకు చాలా ఉపయోగకరంగా పరిగణించబడుతుంది. నెయ్యిలో అలోవెరా జెల్ మిక్స్ చేసి జుట్టుకు రాసుకుంటే ఎన్నో ప్రయోజనాలు కనిపిస్తాయి. అలోవెరా జెల్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. ఇవి జుట్టు రాలడాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. అంతే కాదు, కలబంద జెల్ స్కాల్ప్ ను హైడ్రేట్‌గా ఉంచుతుంది. చుండ్రుని తగ్గించడంలో సహాయపడుతుంది.


పేస్ట్ ఇలా తయారు చేయండి..

జుట్టు ఒత్తుగా, అందంగా ఉండాలంటే నెయ్యి, కలబంద గుజ్జును మీ జుట్టుకు వారానికి రెండు మూడు సార్లు రాసుకోవచ్చు. ఈ పేస్ట్ చేయడానికి.. రెండు టేబుల్ స్పూన్ల దేశీ నెయ్యి, ఒక టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ తీసుకోవాలి. ఈ రెండింటినీ మిక్స్ చేసి జుట్టుకు అప్లై చేయాలి. ఆ తర్వాత 30 నిమిషాలు అలాగే ఉంచి.. ఆపై తేలికపాటి షాంపూతో జుట్టును కడగాలి.


నెయ్యి, కొబ్బరి నూనె వాడకం..

కొబ్బరి నూనెను కూడా ఉపయోగించవచ్చు. ఇది జుట్టును పటిష్టం చేయడంలో, పగుళ్లను తగ్గించడంలో సహాయపడుతుంది. కొబ్బరి నూనెను నెయ్యితో కలిపి జుట్టుకు అప్లై చేయడం వల్ల శిరోజాలకు పోషణ లభిస్తుంది. పొడి, దురద నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది.


పేస్ట్ ఎలా తయారు చేయాలి..

ఈ పేస్ట్ చేయడానికి.. 1 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెతో 2 టేబుల్ స్పూన్ల దేశీ నెయ్యి కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేయాలి. 1 గంట లేదా రాత్రిపూట అలాగే ఉంచి.. ఉదయం తేలికపాటి షాంపూతో జుట్టును కడగాలి. ఇలా వారానికి 2-3 సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

గమనిక: జుట్టును వేడి నీటితో కడగకూడదు. వేడి నీళ్లతో తల స్నానం చేయడం, కడగడం వల్ల స్కాల్ప్ పొడిబారుతుంది. జుట్టును ఆరబెట్టడానికి.. టవల్‌తో బలంగా రుద్దవద్దు. గాలికి ఆరేలా చూసుకోవాలి. కలబంద, కొబ్బరితో ఏదైనా అలెర్జీ ఉంటే.. దానిని ఉపయోగించవద్దు. దీనిని ఉపయోగించే ముందు ప్యాచ్ టెస్ట్ కూడా చేయాలి. మీ జుట్టు రాలిపోతే.. ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి.

For More Lifestyle News and Telugu News..

Updated Date - Jul 01 , 2024 | 04:12 PM

Advertising
Advertising