Hemoglobin: ఈ 8 ఆహారాలు తీసుకుంటే చాలు.. మహిళలలో హిమోగ్లోబిన్ కు ఢోకా ఉండదు..!
ABN, Publish Date - Jul 20 , 2024 | 09:20 AM
రక్తంలో హిమోగ్లోబిన్ పాత్ర చాలా కీలకం. శరీరంలో ప్రతి అవయవానికి ఆక్సిజన్ ను, పోషకాలను సరఫరా చేసేది రక్తమే.. హిమోగ్లోబిన్ స్థాయిలు తక్కువగా ఉంటే ఈ ప్రక్రియలు సజావుగా జరగవు. ఫలితంగా..
రక్తంలో హిమోగ్లోబిన్ పాత్ర చాలా కీలకం. శరీరంలో ప్రతి అవయవానికి ఆక్సిజన్ ను, పోషకాలను సరఫరా చేసేది రక్తమే.. హిమోగ్లోబిన్ స్థాయిలు తక్కువగా ఉంటే ఈ ప్రక్రియలు సజావుగా జరగవు. ఫలితంగా శరీరం వివిధ అనారోగ్యాలకు లోనవుతుంది. విచారించాల్సిన విషయం ఏమిటంటే భారతదేశంలో అధిక శాతం మంది మహిళలు హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న కారణంగా అనీమియా సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే కొన్ని ఆహారాలు తీసుకోవడం ద్వారా హిమోగ్లోబిన్ స్థాయిలు పెంచుకోవచ్చు. అవేంటో తెలుసుకుంటే..
Black Neck: మెడ చర్మం నల్లగా ఎబ్బెట్టుగా ఉందా? ఇలా సింపుల్ టిప్స్ తో వదిలించుకోండి..!
ఆకుకూరలు..
ఆకుకూరలలో ఐరన్, విటమిన్-సి తో పాటు ఇతర పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి ఐరన్ శోషణలో ముఖ్య పాత్ర వహిస్తాయి. ఫలితంగా ఆకుకూరలు తింటే ఐరన్ శరీరానికి అంది హిమోగ్లోబిన్ భర్తీ అవుతుంది. బచ్చలికూర, పాలకూర, తోటకూర, మునగ ఆకు మొదలైన వాటిలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది.
చేపలు..
సాల్మన్, ట్యూనా వంటి చేపలు.. క్లామ్స్, రొయ్యలు వంటి సముద్రపు ఆహారాలలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తింటే హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి.
చిక్కుళ్లు..
కాయధాన్యాలు, శనగలు, బీన్స్ మొదలైనవి ఎర్ర రక్తకణాల ఉత్పత్తికి అవసరమైన నాన్-హీమ్ ఐరన్, ఫోలెట్ వంటివి కలిగి ఉంటాయి. చిక్కుళ్లను క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉంటే హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి.
ఈ 5 డ్రై ఫ్రూట్స్ ను ఉదయాన్నే అస్సలు తినకూడదు..!
గింజలు, విత్తనాలు..
బాదం, గుమ్మడికాయ గింజలు, నువ్వులలో నాన్-హీమ్ ఐరన్ మంచి మొత్తంలో ఉంటుంది. వీటిని ఆహారంలో రెగ్యులర్ గా చేర్చుకుంటూ ఉంటే హిమోగ్లోబిన్ మెరుగవుతుంది.
తృణధాన్యాలు..
క్వినోవా, బ్రౌన్ రైస్, బలవర్థకమైన తృణధాన్యాలలో నాన్-హీమ్ ఐరన్ తో పాటూ మొత్తం శరీర ఆరోగ్యానికి తోడ్పడే ఇతర పోషకాలు కూడా ఉంటాయి. వీటిని తీసుకుంటే అటు హిమోగ్లోబిన్.. ఇటు శరీర ఆరోగ్యం కూడా మెరుగవుతుంది.
డ్రై ప్రూట్స్..
ఆప్రికాట్, ఎండుద్రాక్ష, ఫ్రూనే వంటి ఎండు పండ్లలో నాన్-హీమ్ ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. వీటిని అల్పాహారంలో లేదా స్నాక్స్ లో తీసుకుంటూ ఉంటే హిమోగ్లోబిన్ మెరుగవుతుంది.
ఈ పానీయాలు తాగితే చాలు.. చెడు కొలెస్ట్రాల్ ఈజీగా తగ్గిపోతుంది..
దుంపలు..
ఐరన్, ఫోలిక్ యాసిడ్, ఫైబర్ అధికంగా ఉండే దుంపలు తీసుకుంటే హిమోగ్లోబిన్ స్థాయిలు మెరుగవుతాయి. ఇవి రక్తం ఆరోగ్యంగా ఉండటంలో సహాయపడతాయి.
విటమిన్-సి..
తీసుకునే ఆహారంలో ఐరన్ ను శరీరం గ్రహించాలంటే విటమిన్-సి చాలా ముఖ్యం. విటమిన్-సి పుష్కలంగా ఉన్న పండ్లు, ఆహారాలను తీసుకోవడం వల్ల ఐరన్ గ్రహించే సామర్థ్యం పెరుగుతుంది. కాబట్టి విటమిన్-సి ఆహారాలు బాగా తీసుకోవాలి.
పాదాలు, మడమల్లో ఈ లక్షణాలు ఉంటే చక్కెర స్థాయిలు ఎక్కువున్నట్టే..!
రాత్రిపూట చేసే ఈ పొరపాట్ల వల్ల షుగర్ లెవల్స్ పెరుగుతాయి..!
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Jul 20 , 2024 | 09:20 AM