ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: అతి వ్యాయామం అనర్థమే..!

ABN, Publish Date - Jul 25 , 2024 | 11:27 AM

ఆరోగ్యానికి వ్యాయామం అవసరం. ఇది అందరూ ఒప్పుకునే నిజం. వ్యాయామాలు ఎక్కువైతేనే దుష్పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అధిక వ్యాయామాల వల్ల ఎనీమియా, ఆర్థరైటీస్‌(Anemia, arthritis), గుండె సమస్యలు, జ్ఞాపకం తగ్గడం, శరీరం సరిగా అభివృద్ధి చెందకపోవడం, వంధ్యత్వం వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు డాక్టర్లు.

- వారానికి 150-300 నిమిషాలు చాలంటున్న నిపుణులు

హైదరాబాద్‌ సిటీ: ఆరోగ్యానికి వ్యాయామం అవసరం. ఇది అందరూ ఒప్పుకునే నిజం. వ్యాయామాలు ఎక్కువైతేనే దుష్పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అధిక వ్యాయామాల వల్ల ఎనీమియా, ఆర్థరైటీస్‌(Anemia, arthritis), గుండె సమస్యలు, జ్ఞాపకం తగ్గడం, శరీరం సరిగా అభివృద్ధి చెందకపోవడం, వంధ్యత్వం వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు డాక్టర్లు. ఇదే విషయమై స్పోర్ట్స్‌ మెడిసిన్‌ స్పెషలిస్ట్‌ ర్యాన్‌(Specialist Ryan) మాట్లాడుతూ ‘శరీర తత్వాన్ని బట్టి ఎంత వ్యాయామం అవసరమో అంతే చేయాలి. బాడీ స్ట్రక్చర్‌ లేదంటే ఇతరత్రా కారణాలు చెప్పి అధికంగా వ్యాయామం చేస్తే అర్థరైటిస్‌ సహా అనేక సమస్యలు రావచ్చు’ అని అన్నారు. యూఎస్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ హ్యూమన్‌ సర్వీసెస్‌ సూచనల ప్రకారం వారానికి 150 నుంచి 300 నిమిషాల సాధారణ వ్యాయామం, 75 నుంచి 150 నిమిషాల కఠినమైన వ్యాయామాలు చాలు.

ఇదికూడా చదవండి: స్మితాసబర్వాల్‌ క్షమాపణ చెప్పాలి...


వీటితో పాటుగా వారానికి రెండుసార్లు స్ట్రెంగ్త్‌ ట్రైనింగ్‌ వ్యాయామాలు చేయాలి. సాధారణంగా రోజుకు 60 నుంచి 90 నిమిషాలు, వారానికి మూడు రోజుల వ్యాయామం సరిపోతుందని నగరంలోని పలువురు ఫిట్‌నెస్‌ నిపుణులు(Fitness experts) చెబుతున్నారు. అతిగా చేసే వ్యాయామం వల్ల కలిగే అనర్థాల గురించి ఫిట్‌నెస్‌ నిపుణులు రఘు వెల్లడిస్తూ సరైన రీతిలో వ్యాయామం చేయడం వల్ల శరీరంలో రోగ నిరోధకశక్తి పెరగడంతో పాటుగా ఒత్తిడి తగ్గించే హార్మోన్లు కూడా విడుదలవుతాయి. అధికంగా వ్యాయామం చేయడం వల్ల విడుదలయ్యే అడ్రినలైన్‌ లాంటి హార్మోన్లు మంచికన్నా ఎక్కువగా చెడు చేస్తాయి. అధిక వ్యాయామాల వల్ల నిద్రలేమి లాంటి సమస్యలతో పాటుగా అమ్మాయిలలో పీరియడ్స్‌ సరిగా రాకపోయే అవకాశాలూ ఉన్నాయని వివరించారు.


ఇదికూడా చదవండి: కాల్పుల కలకలం.. పోలీసులపై గొడ్డలి, రాళ్లతో యువకుల దాడి

ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Updated Date - Jul 25 , 2024 | 11:27 AM

Advertising
Advertising
<