Pears Vs Diabetes: మధుమేహం ఉన్నవారికి పియర్స్ పండ్లు చేసే మేలు ఎంత? ఈ నిజాలు తెలిస్తే..!
ABN, Publish Date - Aug 03 , 2024 | 08:37 PM
కేవలం రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం ద్వారా వ్యక్తి ఆహార శైలిని మొత్తం ఇది తారుమారు చేస్తుంది. మధుమేహం లేనివారు ఏ ఆహారాలు తినాలన్నా పెద్దగా ఆలోచించక్కర్లేదు. కానీ..
మధుమేహం ఒక వ్యక్తి జీవితాన్ని తలకిందులు చేసే సమస్య. కేవలం రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం ద్వారా వ్యక్తి ఆహార శైలిని మొత్తం ఇది తారుమారు చేస్తుంది. మధుమేహం లేనివారు ఏ ఆహారాలు తినాలన్నా పెద్దగా ఆలోచించక్కర్లేదు. కానీ మధుమేహం ఉన్నవారు ఆచితూచి తినాల్సి ఉంటుంది. ముఖ్యంగా పండ్ల విషయంలో మధుమేహం ఉన్నవారికి చాలా నియమాలు ఉన్నాయి. పియర్స్ పండ్లు తింటే మధుమేహం ఉన్నవారికి జరిగే మేలు ఎంత? తెలుసుకుంటే..
Hair Growth: ఈ ఆహారాలు తినండి చాలు.. జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా పెరగడం ఖాయం..!
పియర్స్ పండ్లను మధుమేహం ఉన్నవారు తినవచ్చని ఆహార నిపుణులు, వైద్యులు చెబుతున్నారు. వర్షాకాలంలో అందుబాటులోకి వచ్చే ఈ పండ్లు తినడం ద్వారా సీజనల్ సమస్యలతో పాటూ రక్తంలో చక్కెర స్థాయిల విషయంలో కూడా జాగ్రత్త పడవచ్చట.
పియర్స్ పండ్లలో ఫోలిక్ యాసిడ్, జింక్, ఒమేగా-3 వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. వీటిని తింటే రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. వర్షాకాలంలో ఎదురయ్యే సీజనల్ సమస్యలు అయిన జలుబు, జ్వరం, ఇన్ఫెక్షన్లు మొదలైన వాటి బారిన పడకుండా కాపాడుతుంది.
Oats Vs Poha: ఓట్స్ లేదా అటుకులు.. ఆరోగ్యానికి ఏవి మంచివి? పోషకాహార నిపుణులు చెప్పిన షాకింగ్ నిజాలు..!
మధుమేహం ఉన్నవారిలో గుండె జబ్బు సమస్యలు కూడా ఎదురవుతూ ఉంటాయి. గుండె సంబంధ సమస్యలు ఉన్నవారు కూడా ఉంటారు. ఇలాంటి వారు పియర్స్ పండ్లను తింటూ ఉంటే గుండె సమస్యలు రావు. అదేవిధంగా పియర్స్ పండ్లలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది బరువు తగ్గడంలో మెరుగ్గా సహాయపడుతుంది.
పియర్స్ పండ్లు తింటే జీర్ణవ్యవస్థ బలపడుతుంది. ఇందులో ఫైబర్ బరువు తగ్గడానికే కాకుండా జీర్ణక్రియకు కూడా తోడ్పడుతుంది.
ఈ సమస్యలున్నవారు అవిసె గింజలు పొరపాటున కూడా తినకూడదు..!
నెయ్యితో మసాజ్ చేస్తే యవ్వనంగా మారతారా? ఆయుర్వేదం చెప్పిన నిజాలివీ..!
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్నిఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Aug 03 , 2024 | 08:37 PM