Phool Makhana: ఫూల్ మఖానా తింటే బరువు తగ్గుతారా? ఆహార నిపుణులు ఏం చెప్పారంటే..!
ABN, Publish Date - Aug 19 , 2024 | 09:47 AM
ఫూల్ మఖానా కేవలం ఆరోగ్యాన్నే కాదు.. బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుందని కొందరు అంటుంటారు. ఇంతకీ నిజంగానే పూల్ మఖానా బరువు తగ్గడంలో సహాయపడుతుందా?
ఫూల్ మఖానాను ఫాక్స్ నట్స్, తామర గింజలు అని కూడా అంటారు. ఇవి తెలుగు రాష్ట్రాలలో కంటే ఇతర రాష్ట్రాలలో ఆహారంగా ఎక్కువ తీసుకుంటారు. స్నాక్స్, స్వీట్స్ లో మాత్రమే కాకుండా వీటితో కూరలు కూడా తయారు చేస్తారు. ఫూల్ మఖానాలో పోషకాలు మెండుగా ఉండటమే కాకుండా బోలెడు ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి. అయితే ఫూల్ మఖానా కేవలం ఆరోగ్యాన్నే కాదు.. బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుందని కొందరు అంటుంటారు. ఇంతకీ నిజంగానే పూల్ మఖానా బరువు తగ్గడంలో సహాయపడుతుందా? ఆహార నిపుణులు దీని గురించి ఏం చెప్తున్నారు? మఖానా తినడం వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు ఏంటి? తెలుసుకుంటే..
Walking: మార్నింగ్ వాక్ చేసే అలవాటుందా? ఈ నిజాలు తెలుసుకోకుంటే నష్టపోతారు..!
మఖానాలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఆకలిని తగ్గించడం ద్వారా బరువు తగ్గించడంలో సహాయపడుతుంది.
గుండె ఆరోగ్యానికి కూడా ఫూల్ మఖానా చాలా మేలు చేస్తుంది. ఎందుకంటే మఖానాలో పొటాషియం, మెగ్నీషియం ఉంటాయి. ఇవి గుండెను బలంగా, ఆరోగ్యంగా ఆరోగ్యంగా ఉంచుతాయి.
డయాబెటిస్ ఉన్నవాళ్లకు కూడా మఖానా చాలా మంచిది. మఖానాలో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గించడంలో, మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది.
టీ ని మళ్ళీ వేడి చేసి తాగుతుంటారా? ఈ నిజాలు తెలిస్తే..!
ఫూల్ మఖానాలో మంచి మొత్తంలో కాల్షియం ఉంటుంది. ఇది ఎముకలను బలోపేతం చేయడంలో, బోలు ఎముకల వ్యాధి ప్రమాదం నుండి రక్షించడంలో సహాయపడుతుంది. రోజూ ఓ గుప్పెడు ఫూల్ మఖానా ను తీసుకుంటే ఎముకల ఆరోగ్యానికి ఢోకా ఉండదు.
మఖానాలో అమైనో ఆమ్లాలు, విటమిన్-బి6 ఉంటాయి. ఇవి ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. నిద్రను మెరుగుపరచడంలో సహాయపడతాయి.
ఫూల్ మఖానాలో మంచి మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో, మలబద్దకం వంటి సమస్యను నివారించడంలో సహాయపడుతుంది.
త్రివర్ణ పతాక రూపకర్త.. పింగళి వెంకయ్య గురించి ఈ నిజాలు తెలుసా..?
ఉదయాన్నే ఖాళీ కడుపుతో మునగ ఆకుల నీరు తాగితే జరిగేది ఇదే..!
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Aug 19 , 2024 | 09:47 AM