Share News

Skin Care: ముఖ చర్మం మెరిసిపోవాలంటే.. ఇంట్లోనే ఈ డ్రింక్ తయారు చేసుకుని తాగండి..!

ABN , Publish Date - Nov 01 , 2024 | 02:09 PM

ముఖ చర్మం మెరిసిపోవాలని కోరుకోని అమ్మాయిలు ఉండరు. అయితే ఈ ఒక్క డ్రింక్ తాగుతుంటే చాలు.. చర్మం మెరుస్తుంది.

Skin Care:  ముఖ చర్మం మెరిసిపోవాలంటే.. ఇంట్లోనే ఈ డ్రింక్ తయారు చేసుకుని తాగండి..!

అందంగా కనిపించడంలో చర్మం కీలకపాత్ర పోషిస్తుంది. ముఖ చర్మం అందంగా, ముడతలు లేకుండా మెరుస్తూ ఉండాలని కోరుకోని అమ్మాయిలు ఉండరంటే అతిశయోక్తి కాదు. అయితే ఇప్పటి జీవనశైలి, ఆహారం కారణంగా చర్మ ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. చర్మం మీద ముడతలు, మచ్చలు, చర్మ సమస్యలు తగ్గి చర్మం క్లిస్టర్ క్లియర్ గా.. మెరుస్తూ ఉండాలంటే యాలకుల పానీయం తాగాలట. అసలు యాలకుల పానీయం చర్మానికి చేసే మేలు ఏంటి? దీన్ని ఎలా తయారు చేసుకుని తాగాలి.. తెలుసుకుంటే..

భారతదేశంలో అత్యంత అందమైన లక్ష్మీదేవి ఆలయాల గురించి తెలుసా..


యాలకుల నీరు..

యాలకుల పానీయం తయారు చేసుకోవడం చాలా సులభం. స్టౌ మీద గిన్నె పెట్టి అందులో నీరు పోసి కొద్దిగా యాలకుల పొడి వేసి మరిగించాలి. దీన్ని గోరువెచ్చగా, వేడిగా, ఇందులో కాసింత తేనె లేదా బెల్లం అయినా కలిపి తాగవచ్చు. డేట్ సిరప్ అయినా జోడించవచ్చు.

ఇదెలా పనిచేస్తుంది..

యాలకుల నీరు తాగితే మొటిమలు కలిగించే బ్యాక్టీరియా నిరోధిస్తుంది. వాపును తగ్గిస్తుంది. వృద్దాప్య ప్రక్రియను వేగవంతం చేసే ఫ్రీ రాడికల్స్ ను నిరోధిస్తుంది. జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. చర్మాన్ని లోపలి నుండి హైడ్రేట్ చేయడం ద్వారా చర్మానికి మెరుపును ఇస్తుంది. క్రమం తప్పకుండా ఈ నీరు తాగుతూ ఉంటే చర్మం ఆరోగ్యంగా మారుతుంది.

Rice Vs Roti: అన్నం లేదా చపాతీ.. రెండింటిలో ఏది ఆరోగ్యమంటే..


యాలకుల నీరుతో కలిగే మరిన్ని ప్రయోజనాలు..

  • యాలకుల నీరు నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. నోటి దుర్వాసన, చెడు శ్వాసను తగ్గిస్తుంది. చిగుళ్ల వాపు, దంత క్షయానికి కారణమైన ఫలకం ఏర్పడకుండా చేస్తుంది. యాలకులలో సినోల్, టెర్పినేన్, లిమోనెన్ వంటి సమ్మేళనాలతో కలిగిన నూనెలు ఉంటాయి. సినోల్ అనేది క్రిమినాశన, దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది.

  • శ్వాస కోశ సమస్యలను తగ్గించడంలో యాలకుల నీరు సహాయపడుతుంది. శ్వాసకోశంలో రద్దీని క్లియర్ చేస్తుంది. జలుబు, ఫ్లూ వంటి సీజన్ సమస్యలను తగ్గిస్తుంది. శ్లేష్మం తగ్గించడంలో సహాయపడుతుంది. ఉబ్బసం సమస్యకు చెక్ పెడుతుంది.

  • యాలకుల నీరు మానసిక ఆరోగ్యానికి కూడా మంచిది. ఇందులో ఉండే సమ్మేళనాలు మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి.

  • బరువు తగ్గాలని అనుకునే వారికి కూడా యాలకుల నీరు సహాయపడుతుంది. ఇది జీవక్రియను మెరుగ్గా ఉంచుతుంది. ఆకలిని తగ్గిస్తుంది. తద్వారా ఆహారం తక్కువగా తీసుకోవడం, కేలరీలు తక్కువ తీసుకోవడం జరిగి బరువు తగ్గేలా చేస్తుంది.

Health Awareness: పచ్చిపాలు తాగేవారికి షాకింగ్ న్యూస్.. కేరళ వైద్యుడు చెప్ప నిజమిదే..


దుష్ప్రభావాలు..

  • యాలకుల నీరు తీసుకుంటే ప్రయోజనాలే కాదు.. దుష్ప్రభావాలు కూడా ఉంటాయి. యాలకుల నీటిని అతిగా తీసుకుంటే విరేచనాలు, కడుపునొప్పి, వికారం, జీర్ణ సంబంధ సమస్యలు వంటివి ఏర్పడతాయి.

  • యాలకుల నీరు ఎక్కువగా తీసుకుంటే కొందరిలో చర్మం పై దద్దుర్లు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అలెర్జీ వంటి సమస్యలు వస్తాయి.

  • ఏవైనా ఆరోగ్య సమస్యల కోసం మందులు వాడేవారు యాలకుల నీరు తాగితే మందులతో చర్య జరుపుతాయి. ఇవి మందులను ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా రక్తాన్ని పలుచన చేయడానికి వాడే మందులు, కాలేయ సమస్యల కోసం వాడే మందుల మీద దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి..

Health Tips: తేనెను వాడేవారు అందరూ తెలుసుకోవాల్సిన విషయం.. ఈ ఆహారాలతో అస్సలు కలిపి తినకూడదు..

Castor Oil: ముఖానికి ఆముదం రాయడం మంచిదేనా? చాలామందికి తెలియని నిజాలివీ..

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Nov 01 , 2024 | 02:09 PM