ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Soaked Almonds Vs Soaked Raisins: నానబెట్టిన బాదం లేదా నానబెట్టిన ఎండుద్రాక్ష.. బరువు తగ్గడానికి ఏది మేలంటే..!

ABN, Publish Date - Aug 18 , 2024 | 08:54 AM

అధిక బరువు తగ్గించుకోవడానికి కొన్ని ఆహారాలు చాలా బాగా పనిచేస్తాయి. అలాంటి వాటిలో బాదం, ఎండు ద్రాక్ష ముఖ్యమైనవి. చాలామంది రాత్రి నానబెట్టిన ఎండుద్రాక్ష, బాదం లను ఉదయాన్నే ఖాళీ కడుపుతో తింటుంటారు. ఇవి రెండూ బరువు తగ్గించడంలో మంచి ఫలితాలు ఇస్తాయని చెబుతుంటారు. అయితే..

Soaked Almond Vs Soaked Raisins

అధిక బరువు ఇప్పట్లో చాలా మందిని వేధిస్తున్న సమస్య. నిశ్చలమైన జీవనశైలి కారణంగా చాలామంది అధిక బరువు, ఊబకాయం బారిన పడుతుంటారు. అధిక బరువు తగ్గించుకోవడానికి చాలామంది జిమ్, వ్యాయామాలు, డైటింగ్ ఫాలో అవుతుంటారు. అయితే అధిక బరువు తగ్గించుకోవడానికి కొన్ని ఆహారాలు చాలా బాగా పనిచేస్తాయి. అలాంటి వాటిలో బాదం, ఎండు ద్రాక్ష ముఖ్యమైనవి. చాలామంది రాత్రి నానబెట్టిన ఎండుద్రాక్ష, బాదం లను ఉదయాన్నే ఖాళీ కడుపుతో తింటుంటారు. ఇవి రెండూ బరువు తగ్గించడంలో మంచి ఫలితాలు ఇస్తాయని చెబుతుంటారు. అయితే బరువు తగ్గడానికి రెండింటిలో ఏది ఎక్కువ సహాయపడుతుంది? అసలు వీటిని నానబెట్టి ఎందుకు తింటారు?తెలుసుకుంటే..

ఖాళీ కడుపుతో నానబెట్టిన జీడిపప్పు తింటే ఏం జరుగుతుందంటే..!


ఎందుకు నానబెడతారు..

బాదం, ఎండుద్రాక్షలను నానబెట్టి తినడం చాలామంది చేసే పని. ఇది పోషకాల శోషణను నిరోధించే హానికరమైన టానిన్ లను తొలగిస్తుంది. నానబెట్టడం వల్ల జీర్ణప్రక్రియ కూడా తేలిగ్గా ఉంటుంది. ఇది కొవ్వులు జీర్ణం కావడానికి సహాయపడే లిపేస్ అనే ఎంజైమ్ ను కూడా విడుదల చేస్తుంది. అందుకే బరువు తగ్గాలని అనుకునే వారు బాదం, ఎండుద్రాక్షలను నానబెట్టి తింటారు.

ఒంట్లో నీరసంగా అనిపిస్తుందా? ఈ 5 ఆహారాలు తినండి చాలు.. శరీరంలో శక్తి నిండుకుంటుంది..!


రెండింటిలో ఏది ఎక్కువ మేలు..

నానబెట్టిన ఎండుద్రాక్ష ప్రయోజనాలు..

  • రక్తపోటు, బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉంచడంలో నానబెట్టిన ఎండుద్రాక్ష సహాయపడుతుంది. ఇందులో పొటాషియం మంచి మొత్తంలో ఉండటం వల్ల రక్తపోటు, కొలెస్ట్రాల్, గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

  • నానబెట్టిన ఎండుద్రాక్షలో గ్లైసెమిక్ సూచిక తక్కువగా ఉంటుంది. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలు పెంచవు. వీటికి బదులుగా శరీరంలో నెమ్మదిగా శక్తిని విడుదల చేస్తాయి.

  • ఎండుద్రాక్షలో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి చర్మాన్ని కాపాడతాయి. క్రమం తప్పకుండా నానబెట్టిన ఎండుద్రాక్ష తింటే చర్మం మెరుపు పెరుగుతుంది.

  • ఎండుద్రాక్షను నానబెట్టడం వల్ల అవి మృదువుగా మారతాయి. శరీరంలో టానిన్ లను తొలగించడంలో సహాయపడతాయి. పోషకాలను విచ్చన్నం చేయడంలో సహాయపడే ఎంజైమ్ లను సక్రియం చేస్తుంది. శరీరానికి పోషకాలు సంపూర్ణంగా అందేలా చేస్తుంది.

Health Tips: రోజువారీ జీవితంలో ఈ 6 మార్పులు చేసుకుంటే చాలు.. క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుంది..!



నానబెట్టిన బాదం ప్రయోజనాలు..

  • నానబెట్టిన బాదంలో విటమిన్-ఇ ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్. కణాలను ఆక్సీకరణ నష్టం నుండి కాపాడటంలో నానబెట్టిన బాదం సహాయపడుతుంది. చర్మ ఆరోగ్యానికి మంచిది.

  • నానబెట్టిన బాదంలో గుండె ఆరోగ్యానికి సహాయపడే మోనోశాచురేటెడ్ కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గించడంలో సహాయపడతాయి. రక్తపోటును నియంత్రణలో ఉంచి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

  • నానబెట్టిన బాదంలో ఫైబర్, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. పిండి పదార్థాలు తక్కువగా ఉంటాయి. ఇవి బరువు నిర్వహణలో సహయపడతాయి.

  • కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం వంటి పోషకాలు నానబెట్టిన బాదంలో ఉంటాయి. ఇవి ఎముకలను బలంగా, ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.

Skin Care: రాత్రిపూట ఈ టిప్స్ పాటిస్తే చాలు.. వయసు పెరిగినా చర్మం బిగుతుగా యవ్వనంగా ఉంటుంది..!



బరువు తగ్గడానికి ఏది మేలు..

నానబెట్టిన బాదం, నానబెట్టిన ఎండుద్రాక్ష రెండూ గుండె ఆరోగ్యానికి, జీర్ణ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇవి రెండూ కూడా వాటి వాటి కోణంలో బరువు తగ్గడంలో సహాయపడతాయి. వీటిలో ఉండే పోషకాల కంటెంట్ ఆధారంగా ఇవి ప్రయోజనాలు చేకూరుస్తాయి. ఈ రెండింటిని బరువు తగ్గే ప్రక్రియలో ఆహారంలో భాగం చేసుకోవచ్చు.

త్రివర్ణ పతాక రూపకర్త.. పింగళి వెంకయ్య గురించి ఈ నిజాలు తెలుసా..?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో మునగ ఆకుల నీరు తాగితే జరిగేది ఇదే..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Aug 18 , 2024 | 08:54 AM

Advertising
Advertising
<