ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Diabetes: క్షణాల్లో షుగర్ లెవల్స్ తగ్గించుకోవాలా.. ఇవి తినండి

ABN, Publish Date - Jun 06 , 2024 | 11:50 AM

మధుమేహ వ్యాధిగ్రస్తులకు జీవనశైలి చాలా ముఖ్యం. వారి ఆహార అలవాట్లు ఆరోగ్యాన్ని కాపాడటంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కొందరు మధుమేహాన్ని(Diabetes) నియంత్రించుకోవడానికి లైఫ్ స్టైల్‌లో ఎన్నో మార్పులు చేసుకుంటారు.

ఇంటర్నెట్ డెస్క్: మధుమేహ వ్యాధిగ్రస్తులకు జీవనశైలి చాలా ముఖ్యం. వారి ఆహార అలవాట్లు ఆరోగ్యాన్ని కాపాడటంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కొందరు మధుమేహాన్ని(Diabetes) నియంత్రించుకోవడానికి లైఫ్ స్టైల్‌లో ఎన్నో మార్పులు చేసుకుంటారు. అయినా షుగర్ లెవల్స్ కంట్రోల్ కావు. షుగర్ వ్యాధి ఉన్నవారు క్రమం తప్పకుండా టెస్టులు చేయించుకోవాలి. వైద్యుల సూచనల మేరకు ట్యాబ్లెట్లు వాడాలి. తినే ఆహారంలో కొన్నింటిని జత చేసుకోవడం ద్వారా చక్కెర వ్యాధి ఈజీగా కంట్రోల్‌ అవుతుంది. అవేంటో తెలుసుకుందాం.

ఆకుకూరలు

బచ్చలికూర, పాలకూర వంటి ఆకుకూరల్లో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి తక్కువ కార్బోహైడ్రేట్‌లను కలిగి ఉంటాయి. మధుమేహం ఉన్న వారికి అద్భుతమైన మెడిసిన్‌లా పని చేస్తాయి. కార్బోహైడ్రేట్లతోపాటు విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి, ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో, ఇన్సులిన్ సెన్సిటీవిటీని మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఆకు కూరలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

తృణధాన్యాలు

బ్రౌన్ రైస్, క్వినోవా వంటి తృణధాన్యాల్లో ఫైబర్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇవి చక్కటి ఎంపిక. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రిస్తాయి. వీటిలో అదనంగా మెగ్నీషియం, క్రోమియం వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవి ఇన్సులిన్ నియంత్రణకు ఉపయోగపడతాయి.


లీన్ ప్రోటీన్

భోజనంలో స్కిన్‌లెస్ పౌల్ట్రీ, చేపలు, చిక్కుళ్ళు వంటి లీన్ ప్రొటీన్ ఆహారాలను చేర్చుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ప్రోటీన్-రిచ్ ఫుడ్స్ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలపై కంట్రోల్ చేయడానికి సాయపడతాయి.

ఆరోగ్యకరమైన కొవ్వులు

అవకాడో, ఆలివ్ నూనె వంటి ఆహార పదార్థాల్లో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులను మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపడుతుంది. ఆరోగ్యకరమైన కొవ్వులు శక్తిని అందిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. అయినప్పటికీ ఈ కొవ్వుల్లో క్యాలరీలు ఎక్కువగా ఉన్నందున వాటిని మితంగా తీసుకోవడం మంచిది.

బెర్రీలు

స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీస్, రాస్ప్బెర్రీస్ వంటి వాటిల్లో చక్కెర తక్కువగా ఉంటుంది. ఫైబర్, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలపై తక్కువ ప్రభావాన్ని చూపిస్తాయి. తీపికి దూరమైన వారు వీటిని తీసుకోవచ్చు. ఇలా మీ ఆహార అలవాట్లలో మార్పులు చేసుకుంటూ, తగిన వ్యాయామం చేస్తూ, వైద్యుల సూచనల మేరకు మెడిసిన్లు వాడితే మధుమేహం నియంత్రణలోకి వస్తుంది.

Read Latest National News and Telugu News

Updated Date - Jun 06 , 2024 | 11:50 AM

Advertising
Advertising