ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Thyroid: థైరాయిడ్ ఉన్నవారికి అలెర్ట్.. ఈ 3 ఆహారాలు తినడం వెంటనే మానేయండి.. ఎందుకంటే..!

ABN, Publish Date - Jun 18 , 2024 | 11:44 AM

థైరాయిడ్ మానవ శరీరంలో గొంతు భాగంలో ఉండే ఒక గ్రంథి. థైరాయిడ్ గ్రంథి పనితీరులో హెచ్చుతగ్గులు ఉంటే అది హార్మోన్ల విడుదల మీద ప్రభావం చూపిస్తుంది. ఇది కాస్తా జుట్టు రాలడం, బరువు పెరగడం, ఒత్తిడి, జీర్ణ సంబంధ సమస్యలు వంటివి రావడానికి కారణం అవుతుంది. థైరాయిడ్ సమస్యలతో ఇబ్బంది పడేవారు కొన్ని ఆహారాలు తినకూడదు.

థైరాయిడ్ మానవ శరీరంలో గొంతు భాగంలో ఉండే ఒక గ్రంథి. థైరాయిడ్ గ్రంథి పనితీరులో హెచ్చుతగ్గులు ఉంటే అది హార్మోన్ల విడుదల మీద ప్రభావం చూపిస్తుంది. ఇది కాస్తా జుట్టు రాలడం, బరువు పెరగడం, ఒత్తిడి, జీర్ణ సంబంధ సమస్యలు వంటివి రావడానికి కారణం అవుతుంది. థైరాయిడ్ సమస్యలతో ఇబ్బంది పడేవారు కొన్ని ఆహారాలు తినకూడదు. ఒకవేళ తింటే థైరాయిడ్ సమస్య తీవ్రమవుతుందని ఆహార నిపుణులు అంటున్నారు. థైరాయిడ్ ఉన్న వారు అవాయిడ్ చెయ్యాల్సిన ఆహారాలు ఏంటో తెలుసుకుంటే..

ఈ లక్షణాలున్న అబ్బాయిలంటే అమ్మాయిలకు చాలా ఇష్టమట..!


కాలీఫ్లవర్ ఆరోగ్యానికి చాలామంచిది గా పరిగణింపబడుతుంది. కాలీఫ్లవర్ లో విటమిన్లు, పోషకాలు సమృద్దిగా ఉంటాయి. కానీ థైరాయిడ్ సమస్యలతో బాధపడేవారు కాలీఫ్లవర్ తినకూడదు. దీని వల్ల థైరాయిడ్ సమస్యలు పెరుగుతాయి.

సోయాబీన్ ఆరోగ్యానికి చాలామంచిది. కానీ దీన్ని ఆహారంలో తీసుకునే అలవాటు ఉన్నవారిలో థైరాయిడ్ ఉంటే అది వారికి మేలు చేయడానికి బదులు చేటు చేస్తుంది. ఇధి థైరాయిడ్ సమస్యను మరింత తీవ్రం చేస్తుంది.

పిల్లలలో ఏకాగ్రత పెరగాలంటే ఈ యోగా ఆసనాలు ట్రై చేయండి..!


ఆహారంలో ఉప్పు కొద్దిగా తక్కువైనా అయిష్టత వ్యక్తం చేసేవారు ఉంటారు. కానీ థైరాయిడ్ సమస్య ఉన్నవారు ఉప్పు తీసుకోవడంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రక్తపోటు ఉన్నవారికంటే థైరాయిడ్ ఉన్నవారు ఉప్పు మితంగా తీసుకోవడం మంచిది. ఉప్పు ఏమాత్రం ఎక్కువ తీసుకున్నా థైరాయిడ్ సమస్య మరింత తీవ్రం అవుతుంది.

మహిళలలో ఐరన్ లోపం ఉంటే కనిపించే లక్షణాలు ఇవే..!

పిల్లలలో ఏకాగ్రత పెరగాలంటే ఈ యోగా ఆసనాలు ట్రై చేయండి..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jun 18 , 2024 | 11:44 AM

Advertising
Advertising