ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Vakkaya: వాక్కాయ దొరికితే అస్సలు వదలకండి.. వీటిని తింటే ఎన్ని లాభాలు ఉంటాయంటే..!

ABN, Publish Date - Aug 07 , 2024 | 10:11 AM

చాలా మందికి వాక్కాయలతో వంటలు చేస్తారని తెలుసు కానీ వాటితో కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలియదు. అవేంటో తెలిస్తే

Vakkayalu

వాక్కాయలు లేత గులాబీ రంగులో పుల్లగా ఉంటాయి. చాలా ప్రాంతాలలో వీటితో పచ్చడి, పప్పు వంటి వంటకాలు చేస్తుంటారు. అడవి ప్రాంతాలలో వాక్కాయ చెట్లు ఎక్కువగా పెరుగుతాయి. చాలా మందికి వాక్కాయలతో వంటలు చేస్తారని తెలుసు కానీ వాటితో కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలియదు. అవేంటో తెలిస్తే వాక్కాయలు ఎక్కడ కనిపించినా వాటిని వదలలాని అనిపించదు.

  • వాక్కాయలలో విటమిన్ సి కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది, దీని వల్ల ఇన్ఫెక్షన్లు వ్యాధులకు దూరంగా ఉండవచ్చు. ముఖ్యంగా వర్షాకాలంలో ఎక్కువగా ఉండే ఇన్ఫెక్షన్ల నుండి దూరంగా ఉండాలంటే వాక్కాయలను తప్పనిసరిగా తినాలి.

ఈ 5 సమస్యలు ఉన్నవారు ముల్లంగిని అస్సలు తినకూడదు..!



  • ఫైబర్ ఉన్న పండ్లు, కూరగాయలు జీర్ణవ్యవస్థకు చాలా మేలు చేస్తాయి. వాక్కాయలలో కూడా ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది, ప్రేగు కదలికలను నియంత్రిస్తుంది, మలబద్ధకాన్ని నివారిస్తుంది.

  • వాక్కాయలో యాంటీఆక్సిడెంట్లు సమృద్దిగా ఉంటాయి. ఇవి మంటను తగ్గించడంలో, చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. తద్వారా గుండె ఆరోగ్యం సేఫ్ గా ఉంటుంది.

  • వాక్కాయలలో విటమిన్ ఎ, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని ఎదుర్కుంటాయి. చర్మానికి ఆరోగ్యకరమైన మెరుపును ఇస్తాయి. చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

నెయ్యితో మసాజ్ చేస్తే యవ్వనంగా మారతారా? ఆయుర్వేదం చెప్పిన నిజాలివీ..!


  • రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కూడా వాక్కాయలు మెరుగ్గా పనిచేస్తాయి. మధుమేహం ఉన్నవారు వాక్కాయలతో చేసిన ఆహార పదార్థాలు తింటూ ఉంటే మంచి ఫలితాలు ఉంటాయి.

  • వాక్కాయను యాపిల్, నారింజ, లేదా నీటితో అయినా సరే కలిపి జ్యూస్ తయారుచేసుకుని తాగితే మంచిది. ఇది శరీరానికి పోషకాలనే కాదు.. మంచి రిఫ్రెష్మెంట్ కూడా ఇస్తుంది.

  • వాక్కాయలు ఎల్లప్పుడూ అందుబాటులో లేని వారు వాక్కాయలను ఎండించి పొడి చేసుకుని వాటిని కూరల్లోనూ, పులుసు తయారీలోనూ జోడించవచ్చు. ఇది కూరకు అదనపు రుచిని ఇవ్వడమే కాకుండా వాక్కాయ నుండి లభించే ఫలితాలు లభిస్తాయి.

ఈ చిన్న ట్రిక్స్ పాటిస్తే చాలు.. వర్షాకాలంలో గ్యాడ్జెట్లు సేఫ్..!

చాణక్యుడు చెప్పిన ఈ 10 విషయాలు అనుసరిస్తే.. యువత విజయాల బాట పడతారు!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Aug 07 , 2024 | 10:27 AM

Advertising
Advertising
<