Weight Loss: కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉన్న ఈ ఆహారాలు తింటే చాలు.. ఎంత తొందరగా బరువు తగ్గుతారంటే..!
ABN, Publish Date - Jul 17 , 2024 | 01:23 PM
బరువు తగ్గాలని అందరూ అనుకుంటారు. బరువు తగ్గే ప్రయత్నం కూడా చేస్తారు. కానీ బరువు తగ్గడం అంత సులువు కాదు. చాలామంది బరువు తగ్గడం కోసం బరువు తగ్గించే పానీయాలు తాగుతారు, మరికొందరు విభిన్న రకాల డైట్ లు ఫాలో అవుతారు. అ.యితే..
బరువు తగ్గాలని అందరూ అనుకుంటారు. బరువు తగ్గే ప్రయత్నం కూడా చేస్తారు. కానీ బరువు తగ్గడం అంత సులువు కాదు. చాలామంది బరువు తగ్గడం కోసం బరువు తగ్గించే పానీయాలు తాగుతారు, మరికొందరు విభిన్న రకాల డైట్ లు ఫాలో అవుతారు. ఇంకొందరు జిమ్ ల మీద, మరికొందరు వాకింగ్, యోగా వంటి వాటిమీద ఆధారపడతారు. అయితే బరువు తగ్గడంలో కార్బోహేడ్రేట్లు ప్రధాన పాత్ర పోషిస్తాయి. కార్బోహైడ్రేట్లు అధికంగా తీసుకుంటే బరువు పెరుగుతారు. అదే కార్బోహెడ్రేట్లు తక్కువ తీసుకుంటే బరువు తగ్గడంలో చాలా హెల్ప్ అవుతాయి. తక్కువ కార్బోహైడ్రేట్లు ఉన్న ఆహారాలేంటో తెలుసుకుంటే..
Onion Shampoo: ఈ 4 మార్గాలలో ఇంట్లోనే ఉల్లిపాయ షాంపూ తయారుచేసుకుని వాడండి.. జుట్టు ఎంత బాగా పెరుగుతుందంటే..!
ఆకుకూరలు..
విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండి తక్కువ కార్బోహైడ్రేట్లు ఉన్న ఆహారాలలో బచ్చలికూర, కాలే, స్విస్ చార్డ్ వంటి ఆకు కూరలు ఉత్తమమైనవి. ఈ ఆకుకూరలలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది, ఇది ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచుతుంది. ఆకుకూరలలో ఐరన్, కాల్షియం, విటమిన్ A, C, K పుష్కలంగా ఉంటాయి.
గుడ్లు..
గుడ్లలో ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ B12, కోలిన్ వంటి ముఖ్యమైన పోషకాలు అధికంగా ఉంటాయి. గుడ్లు తినడం వల్ల భోజనానికి మధ్య వచ్చే గ్యాప్ లో చిరుతిండి తినాలనే కోరికను తగ్గించవచ్చు. గుడ్లు ఎక్కువసేపు కడుపు నిండిన ఫీలింగ్ ఇస్తాయి.
Viral: వావ్.. మన సీతాకోకచిలుక హీరోయిన్ తెలివి అమోఘం.. ఒక్క చుక్క నూనె చిందకుండా ప్యాకెట్ నుండి నూనెను ఎలా పోసారో చూడండి..!
అవకాడో..
సలాడ్ లలో అవోకాడోను జోడించడం వల్ల రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. తక్కువ కార్బోహైడ్రేట్లు తీసుకోవాలని అనుకుంటే అవకాడో మంచి ఆప్షన్.
గ్రీక్ పెరుగు..
గ్రీక్ పెరుగులో ప్రోటీన్, ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో ప్రోబయోటిక్ బ్యాక్టీరియా ఉంటుంది. ఇది పేగు ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
పండ్లు..
స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీస్, రాస్ప్బెర్రీస్ వంటి బెర్రీలలో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. ఫైబర్, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. వీటిని ఆహారంలో తీసుకుంటూ ఉంటే బరువు తగ్గడం సులువు.
పాదాలు, మడమల్లో ఈ లక్షణాలు ఉంటే చక్కెర స్థాయిలు ఎక్కువున్నట్టే..!
శరీరంలో ఆక్సిజన్ స్థాయిలను పెంచే సూపర్ ఫుడ్స్ లిస్ట్ ఇదీ..!
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Jul 17 , 2024 | 01:23 PM