ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Weight Loss: వావ్.. 6 నెలల్లోనే ఇన్ని కిలోల బరువు తగ్గిందా.. ఎలా సాధ్యమైందో మీరు తెలుసుకోండి..

ABN, Publish Date - Dec 02 , 2024 | 04:50 PM

జిమ్‌కు వెళ్లకుండా, కఠినమైన డైట్‌ని పాటించకుండా 6 నెలల్లోనే ఓ మహిళ ఏకంగా 25 కిలోల బరువు తగ్గింది. తను ఎలా బరువు తగ్గిందో చెబుతూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది.

Sakshi Yadav

Weight Loss: బరువు తగ్గడం చాలా కష్టమైన పని. కొంతమంది రెగ్యులర్ గా జిమ్‌కు వెళ్లినా, డైట్ ని పాటించినా బరువు మాత్రం అస్సలు తగ్గరు. అయితే, సాక్షి యాదవ్ అనే మహిళ మాత్రం జిమ్ కు వెళ్లకుండా, కఠినమైన డైట్ ఫాలో అవ్వకుండా 6 నెలల్లో ఏకంగా 25 కిలోలు తగ్గి అందరినీ ఆశ్చర్యపరిచింది. అందుకు సంబంధించి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేసింది. తను బరువు తగ్గడానికి గల కారణాలను కూడా వివరించింది.

1. ఇంట్లో పనులు : వారానికి ఆరు రోజులు 40 నుండి 50 నిమిషాల పాటు ఇంట్లో పనులు చేశానని తెలిపింది.

2. ఇంటి భోజనం : బయట ఫుడ్ కాకుండా కేవలం ఇంట్లో తయారు చేసిన భోజనం మాత్రమే తిన్నట్లు చెప్పింది. అయితే, ఇంటి భోజనంలో ప్రొటీన్లు, ఫైబర్ అధికంగా ఉండేలా చూసుకుంది.

3. ఫాస్ట్ ఫుడ్స్ కు దూరం : ఫాస్ట్ ఫుడ్స్, ప్రాసెస్ చేసిన ఆహారాలకు, చెక్కర ఎక్కువగా ఉండే పదార్థాలకు దూరంగా ఉన్నట్లు తెలిపింది. వాటిలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ ఆహారాలకు దూరంగా ఉండి బరువు తగ్గించుకున్నట్లు వెల్లడించింది.


4. మెట్లు ఎక్కడం: చురుకుగా ఉండటానికి ప్రతిరోజూ 10,000 మెట్లను ఎక్కడం అలవాటు చేసుకుంది. ఫోన్ కాల్స్ సమయంలో కూడా మెట్లు ఎక్కుతూ దిగుతూ ఉండేది.

5. హైడ్రేషన్: బరువు తగ్గడంలో నీరు కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి, నీరు ఎక్కువగా తీసుకుంటూ రోజంతా హైడ్రేటెడ్‌గా ఉండేలా చూసుకుంది.

6. స్థిరత్వం: బరువు తగ్గాలని కేవలం ఒకటి రెండు రోజులు మాత్రమే డైట్, వర్కవుట్‌లు చేస్తే సరిపోదు. క్రమం తప్పకుండా వర్కవుట్ లు చేయాలి. లేదంటే బరువు తగ్గడం కష్టమవుతుంది.

7. అతిగా తినవద్దు: అతిగా తినడం వల్ల బరువు తగ్గలేరు. కాబట్టి, ఎక్కువగా తినాలి అని అనిపించినా కొన్ని ఫుడ్స్ తీసుకోకపోవడం మంచిది.

8. పోల్చవద్దు : బరువు తగ్గడానికి మీ ప్రయత్నం మీరు చేయండి. వేరే వాళ్లతో పోల్చుకోవద్దు. ఎందుకంటే ప్రతి వ్యక్తి భిన్నంగా ఉంటాడు.

9. ఓపికగా ఉండండి: బరువు తగ్గడానికి సమయం పడుతుంది. ఒక్కసారిగా బరువు పూర్తిగా తగ్గాలి అంటే కష్టం. కాబట్టి, ఓపికగా ఉండాలి.

(Note:పై సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా ఇవ్వబడింది. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ABN దీనిని ధృవీకరించ లేదు. ఆరోగ్యానికి సంబంధించి ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించండి.)

Updated Date - Dec 02 , 2024 | 05:14 PM