ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Heavy Rains: భారీ వర్షాలతో 11 మంది మృత్యువాత.. ఇళ్లపై కూలిన మట్టి చరియలు

ABN, Publish Date - Jul 28 , 2024 | 11:56 AM

చైనా(china)లో గత కొన్ని రోజులుగా వర్షాలు(heavy rains) విధ్వంసం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలోనే అనేక ప్రాంతాల్లో వినాశకర దృశ్యాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆదివారం ఆగ్నేయ చైనాలో వరదల కారణంగా ఓ ఇంటిపై బురద పడి 11 మంది మరణించారు.

heavy rains in china

చైనా(china)లో గత కొన్ని రోజులుగా వర్షాలు(heavy rains) విధ్వంసం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలోనే అనేక ప్రాంతాల్లో వినాశకర దృశ్యాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆదివారం ఆగ్నేయ చైనాలో వరదల కారణంగా ఓ ఇంటిపై బురద పడి 11 మంది మరణించారు. ఉష్ణమండల తుఫాను కారణంగా అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. శనివారం షాంఘైలో ఓ చెట్టు కూలి స్కూటర్‌పై వెళ్తున్న డెలివరీ బాయ్‌‌పై పడటంతో మృతి చెందాడు. అయితే ఈ జెమీ తుఫాను ఈ 3 దేశాల్లో విధ్వంసం సృష్టించిందని అక్కడి అధికారులు చెబుతున్నారు.


ఫిలిప్పీన్స్‌లో కూడా

చైనాను చేరుకోకముందే టైఫూన్ జెమీ(typhoon gaemi) ఫిలిప్పీన్స్‌లో కూడా విధ్వంసం సృష్టించింది. ఆ క్రమంలో దాదాపు 34 మంది మరణించారు. టైఫూన్ జెమీ తైవాన్ ద్వీపంలో కూడా కొనసాగింది. ఇక్కడ మృతుల సంఖ్య 10కి పెరిగింది. హునాన్ ప్రావిన్స్‌లోని హెంగ్‌యాంగ్ నగర పరిధిలోని యుయెలిన్ గ్రామంలో ఉదయం 8 గంటల సమయంలో కొండచరియలు విరిగిపడినట్లు అక్కడి మీడియా తెలిపింది. భారీ వర్షాల కారణంగా పర్వతాల నుంచి నీరు ప్రవహించడం వల్లే కొండచరియలు విరిగిపడినట్లు నివేదిక పేర్కొంది. ఉష్ణమండల తుఫాను నేపథ్యంలో హునాన్ ప్రావిన్స్‌లోని ఆగ్నేయ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసినట్లు చైనా వాతావరణ విభాగం వెల్లడించింది.

ఇవి కూడా చదవండి:

Israel: హిజ్బుల్లా' దాడిలో 11 మంది పిల్లలు మృతి.. ప్రధాని హెచ్చరిక

Womens Asia Cup Final: నేడు మహిళల ఆసియా కప్ 2024 ఫైనల్ పోరు.. ఎవరు గెలిచే ఛాన్స్ ఉందంటే..


27 వేల మంది

ఈ క్రమంలో చైనా(china)లోని ఈశాన్య లియానింగ్ ప్రావిన్స్‌లో టైఫూన్ గేమీ దృష్ట్యా 27 వేల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ ఏడాది మూడో టైఫూన్ అయిన జెమి టైఫూన్ కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రావిన్స్‌లోని 40 రిజర్వాయర్లలో నీటి మట్టం పెరిగిందని ప్రాంతీయ వరద నియంత్రణ సహాయ విభాగం తెలిపింది. ప్రస్తుతం ఆయా రిజర్వాయర్ల నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అంతేకాదు ఆదివారం నుంచి వచ్చే మంగళవారం వరకు కూడా లియానింగ్ ప్రావిన్స్‌లోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుందని ప్రాంతీయ వాతావరణ శాఖ తెలిపింది.

మూసివేత

ఈ క్రమంలో ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. దీంతోపాటు వరదల ముప్పును నివారించడానికి ప్రావిన్స్‌లోని వందలాది రసాయన పరిశ్రమలు, మైనింగ్ కంపెనీలు తమ కార్యాలయాలను మూసివేశాయి. ఉద్యోగులను, చుట్టుపక్కల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. టైఫూన్ Gemei నేపథ్యంలో వరదలు సంబంధించిన అత్యవసర ప్రాంతాల్లో నిర్వహణ మంత్రిత్వ శాఖ సమావేశాలు నిర్వహించింది.


ఇవి కూడా చదవండి:


Paris Olympics 2024: పారిస్ ఒలంపిక్స్‌లో తొలిరోజు ఆస్ట్రేలియాకు 5 మెడల్స్.. భారత్ విషయానికొస్తే..


Paris Olympics : తొలి స్వర్ణం చైనా ఖాతాలో..


first T20 India vs Sri Lanka : ‘టాప్‌’షోతో బోణీ


Read More international News and Latest Telugu News

Updated Date - Jul 28 , 2024 | 12:00 PM

Advertising
Advertising
<