15 లక్షల బ్యాంకు బ్యాలెన్స్ ఉంటేనే బ్రిటన్‌లో ఉన్నత విద్య
ABN, Publish Date - Sep 17 , 2024 | 03:41 AM
బ్రిటన్‌లో ఉన్నత విద్యను అభ్యసించదలిచిన విద్యార్థులకు యూకే సర్కారు షాకిచ్చింది..! ఇకపై బ్రిటన్‌కు వచ్చే విద్యార్థులు తమ వసతి, నిర్వహణకు గాను బ్యాంకుల్లో చూపించాల్సిన నిల్వల మొత్తాన్ని దాదాపు రూ.15లక్షలకు పెంచింది.
లండన్, సెప్టెంబరు 16: బ్రిటన్‌లో ఉన్నత విద్యను అభ్యసించదలిచిన విద్యార్థులకు యూకే సర్కారు షాకిచ్చింది..! ఇకపై బ్రిటన్‌కు వచ్చే విద్యార్థులు తమ వసతి, నిర్వహణకు గాను బ్యాంకుల్లో చూపించాల్సిన నిల్వల మొత్తాన్ని దాదాపు రూ.15లక్షలకు పెంచింది. ఇది జనవరి 2 నుంచి అమల్లోకి రానుంది. లండన్ నగరంలో చదువుకునే విద్యార్థులు వీసా దరఖాస్తు సమయంలో నెలకు 1,483 పౌండ్ల(సుమారు రూ.1.65 లక్షలు) చొప్పున 9 నెలలకు గాను బ్యాంకు నిల్వలను చూపించాల్సి ఉంటుంది. లండన్ నగరం వెలుపల చదివే వారికి ఆ మొత్తం నెలకు 1,136 పౌండ్లు(సుమారు రూ.1.26 లక్షలు)గా నిర్ణయించారు. వీసా దరఖాస్తు సమయంలో విద్యార్థులు 9 నెలలకు గాను బ్యాంకు నిల్వలను చూపించాల్సి ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. తొమ్మిది నెలల మొత్తం రూ.13 లక్షల నుంచి రూ.15 లక్షలుగా ఉంటుంది.
Updated Date - Sep 17 , 2024 | 03:41 AM