ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Pakistan: బస్సు లోయలో పడి 29 మంది దుర్మరణం, ఒకేరోజు రెండు ప్రమాదాలు

ABN, Publish Date - Aug 25 , 2024 | 02:59 PM

పాకిస్థాన్‌ లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. 30 మంది ప్రయాణికులతో హవేలి కథువా నుంచి రావల్పిండి వెళ్తుండగా బస్సు అదుపుతప్పి లోయలో పడటంతో 29 మంది దుర్మరణం పాలయ్యారు. పనా బ్రిడ్జి సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఇస్లామాబాద్: పాకిస్థాన్‌ (Pakistan)లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. 30 మంది ప్రయాణికులతో హవేలి కథువా నుంచి రావల్పిండి వెళ్తుండగా బస్సు అదుపుతప్పి లోయలో పడటంతో 29 మంది దుర్మరణం పాలయ్యారు. పనా బ్రిడ్జి సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు, సహాయక బృందాలు ప్రమాద స్థలికి చేరుకుని స్థానికుల సహాయంతో మృతదేహాలను వెలికి తీస్తున్నారు. బస్సు బ్రేకులు ఫెయిల్ కావడం వల్లే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.


రెండో ఘటన

కాగా, పంజాబ్ ప్రావిన్స్‌లో ఘోర బస్సు ప్రమాదానికి కొద్ది గంటలకు ముందే షియా ముస్లిం యాత్రికులతో ఇరాక్ నుంచి ఇరాన్ మీదుగా వస్తున్న బస్సు పాకిస్థాన్ నైరుతి ప్రాంతంలో ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందగా, 32 మంది గాయపడ్డారు. బస్సు బ్రేకులు ఫెయిల్ కావడం వల్లే ప్రమాదం జరిగినట్టు స్థానిక పోలీస్ చీఫ్ ఖ్వాజీ సాబిర్ తెలిపారు.

Hezbollah: హిజ్బుల్లాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. రివర్స్ ఎటాక్ చేసిన హిజ్బుల్లా


బస్సు ప్రమాదాలు రివాజే..

ఇటీవల పాకిస్థాన్‌లో బస్సు ప్రమాదాలు చోటుచేసుకోవడం రివాజుగా మారింది. పొరుగున ఉన్న ఇరాన్ నుంచి ఇరాక్‌కు వెళ్తున్న బస్సు గత ఆదివారంనాడు ప్రమాదానికి గురై 35 మంది పాకిస్థాన్ యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాలను పాకిస్థాన్ మిలటరీ విమానంలో తీసుకువచ్చి సింధ్ ప్రావిన్స్‌లో ఖననం చేశారు.

Read More International News and Latest Telugu News

Updated Date - Aug 25 , 2024 | 03:00 PM

Advertising
Advertising
<