PM Modi: బుర్జ్ ఖలీఫాపై భారత జెండా ‘భారత్ గౌరవ అతిథి’ అంటూ కామెంట్స్
ABN, Publish Date - Feb 14 , 2024 | 08:30 AM
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పర్యటనలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉన్నారు. వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్‌లో ఈ రోజు ప్రసంగిస్తారు. దుబాయ్‌లో గల బుర్జ్ ఖలీఫా మీద భారత జాతీయ జెండాను ప్రదర్శించారు. దాని పైన భారత దేశం తమ గౌరవ అతిథి అని రాశారు.
దుబాయ్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) పర్యటనలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉన్నారు. వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్‌లో ఈ రోజు ప్రసంగిస్తారు. దుబాయ్‌లో గల బుర్జ్ ఖలీఫా మీద భారత జాతీయ జెండాను ప్రదర్శించారు. దాని పైన భారత దేశం తమ గౌరవ అతిథి అని రాశారు. ప్రధాని మోదీకి దుబాయ్ రాజు ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ స్వాగతం పలికారు. ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధం మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ‘వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్‌లో గౌరవ అతిథిగా భారత దేశం పాల్గొంది. ప్రధాని నరేంద్ర మోడీకి హృదయపూర్వకంగా స్వాగతం. ఇరుదేశాల సంబంధాలు అంతర్జాతీయ సహకారానికి నమూనాగా నిలుస్తాయి అని’ దుబాయ్ రాజు పేర్కొన్నారు. యుఏఈ ఉపాధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఆహ్వానించడంతో ప్రధాని మోదీ దుబాయ్ పర్యటనకు వెళ్లారు. వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ 2024లో కీలక ఉపన్యాసం చేస్తారు.
యూఏఈలో స్వామి నారాయణ్ ఆలయం నిర్మించారు. 27 ఎకరాల స్థలంలో ఏడు గోపురాలతో సుందరంగా ఆలయం తీర్చిదిద్దారు. యూఏఈలోని ఏడు ఎమిరేట్స్‌కు గోపురాలు ప్రతీకగా నిలుస్తాయి. ఆలయ నిర్మాణంలో రాజస్థాన్ పాలరాతిని వినియోగించారు. ఆలయాన్ని ప్రధాని మోదీ బుధవారం నాడు (ఈ రోజు) ప్రారంభిస్తారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Feb 14 , 2024 | 08:30 AM