Beijing: చైనా సీ డ్రాగన్.. ఫ్యూజియాన్
ABN, Publish Date - May 07 , 2024 | 04:33 AM
సంఖ్యాపరంగా ప్రపంచంలోనే అతిపెద్ద నౌకా దళ శక్తిగా ఉన్న చైనా.. తన బలాన్ని ఇతోధికంగా పెంచుకునే క్రమంలో మూడో విమాన వాహక యుద్ధనౌక ఫ్యూజియాన్‌ను రంగంలోకి దిం చింది
విమానవాహక యుద్ధ నౌక సీ ట్రయల్స్ ప్రారంభం
అమెరికాకు ధీటుగా ఎలకో్ట్రమ్యాగ్నెటిక్ ఎయిర్‌క్రాఫ్ట్
లాంచ్ సిస్టమ్‌తో అందుబాటులోకి తెచ్చిన చైనా
బీజింగ్, మే 6: సంఖ్యాపరంగా ప్రపంచంలోనే అతిపెద్ద నౌకా దళ శక్తిగా ఉన్న చైనా.. తన బలాన్ని ఇతోధికంగా పెంచుకునే క్రమంలో మూడో విమాన వాహక యుద్ధనౌక ఫ్యూజియాన్‌ను రంగంలోకి దిం చింది! ప్రపంచంలోనే అతిపెద్దదైన అమెరికా విమానవాహక యుద్ధ నౌక ‘యూఎ్‌సఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్’లో మాత్రమే ఉన్న ‘ఈమాల్స్ (ఎలకో్ట్రమ్యాగ్నెటిక్ ఎయిర్‌క్రాఫ్ట్ లాంచ్ సిస్టమ్)’తో చైనా దీన్ని రూ పొందించడం విశేషం. మే1న ఈ ఫ్యూజియాన్ సీ ట్రయల్స్‌ను ప్రా రంభించింది. ఆ యుద్ధనౌకలోని ప్రొపల్షన్, విద్యుత్ వ్యవస్థల పనితీరు, స్థిరత్వాన్ని చైనా రెండేళ్లు పరీక్షించి, ఐదేళ్లలో తన నౌకాదళానికి అందుబాటులోకితేనుంది. దీని బరువు దాదాపు 80వేల టన్నులు. పొడుగు 1036అడుగులు. ఫ్యూజియాన్‌కన్నా ముందు చైనా వద్ద 2 విమాన వాహక యుద్ధనౌకలున్నాయి. మొదటిది.. లియావోనింగ్. 1998లో చైనా దీన్ని ఉక్రెయిన్ నుంచి కొని మార్పుచేర్పులు చేసుకుంది. 2019లో షాంగ్‌డాంగ్ అనే దేశీయ విమాన వాహక యుద్ధనౌకను తన నేవీకి అందుబాటులోకి తెచ్చింది. వీటికన్నా సాంకేతికంగా అత్యంత అధునాతనమైనది ఫ్యూజియాన్ యుద్ధనౌక.
ఇక విమానం టేకాఫ్ కావాలంటే పెద్ద రన్‌వే అవసరం. యుద్ధనౌకపై అంతపెద్ద రన్‌వే ఉండదు కాబట్టి వాటిపై నుంచి యుద్ధవిమానాల టేకా్‌ఫకు స్టోబార్, క్యాటోబార్ విధానాలను అనుసరిస్తారు. స్టోబార్ అంటే షార్ట్ టేకాఫ్ బ్యారియర్ అరెస్టెడ్ రికవరీ విధానం. ఇందులో యుద్ధనౌక చివర్లో రన్‌వే కొంత పైకి లేచినట్టు ఉంటుంది. క్యాటోబార్ (కెటాపల్ట్ అసిస్టెడ్ టేకాఫ్ బ్యారియర్ అసిస్టెడ్ రికవరీ) విధానం.. పంగలకర్ర పెట్టి ఒక రాయిని లాగిపెట్టి కొడితే ఆ రాయి ఎలా దూసుకెళుతుందో అలాంటిది. ఈ విధానంలో విమానాల టేకా ఫ్‌కు ఆవిరి శక్తి వాడతారు. దానికి బదులు విద్యుదయస్కాంత శక్తి వాడితే అదే ఈమాల్స్. దీంతో టేకాఫ్ అయ్యే విమానాలరేంజ్‌ఎక్కువ.
మనకు పక్కలో బల్లమే..
గత 3 దశాబ్దాలుగా హిందూ మహాసముద్రంపై కన్నేసి విస్తృత కార్యకలాపాలతో తన ప్రాబల్యాన్ని పెంచుకుంటున్న చైనా.. భారతదేశ క్షిపణి పరీక్షలను అతి దగ్గర్నుంచీ పరిశీలిస్తూ పక్కలోబల్లెంలా తయారైంది. విమానవాహక యుద్ధనౌకల విషయంలో చైనా, భారత్ సమానంగా ఉన్నాయి. చైనా వద్ద 2 ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్లు ఉంటే.. మనదగ్గరా 2 (ఐఎన్‌ఎ్‌స విక్రమాదిత్య, ఐఎన్‌ఎ్‌స విక్రాంత్) విమానవాహక యుద్ధనౌకలున్నాయి. ఇప్పుడు ‘ఈమాల్స్’తో చైనా మూడో ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్‌ను రంగంలోకి దించడం భారత్‌కు ఆందోళన కలిగించేదే. 2035నాటికి ఇదే తరహాలో విద్యుదయస్కాంత శక్తితో యుద్ధవిమానాలను లాంచ్ చేయగల మరో 3 విమానవాహక యుద్ధ నౌకలను తననౌకాదళానికి అందుబాటులోకి తేవాలన్నది చైనా లక్ష్యం. అదే జరిగితే ఇండో-పసిఫిక్ ప్రాంతంలో అమేయ శక్తిగా మారి చైనా మనకు పెనుముప్పుగా మారుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది
Updated Date - May 07 , 2024 | 04:33 AM