Donald Trump: అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న డొనాల్డ్ ట్రంప్‌నకు షాక్
ABN, Publish Date - May 31 , 2024 | 09:00 AM
2024 అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఉన్న డొనాల్డ్ ట్రంప్‌నకు కోర్టు నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పోర్న్ స్టార్‌కు రహస్యంగా డబ్బు చెల్లించిన హుష్ మనీ కేసులో అమెరికా కోర్టు అయనను దోషిగా తేల్చింది. మొత్తం 34 కేసుల్లో ట్రంప్‌ను కోర్టు దోషిగా తేల్చింది.
2024 అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఉన్న డొనాల్డ్ ట్రంప్‌నకు(Donald Trump) కోర్టు నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పోర్న్ స్టార్‌కు రహస్యంగా డబ్బు చెల్లించిన హుష్ మనీ కేసులో అమెరికా కోర్టు ఆయనను దోషిగా తేల్చింది. మొత్తం 34 కేసుల్లో ట్రంప్‌ను కోర్టు దోషిగా పేర్కొంది. జులై 11న శిక్ష ఖరారు చేయాలని న్యాయమూర్తి నిర్ణయించారు. 2024లో రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థిగా ట్రంప్ బరిలోకి దిగనున్న తరుణంలో ఆయనకు శిక్ష ఖరారు కానుంది. దీంతో క్రిమినల్ కేసుల్లో శిక్ష పడిన తొలి అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ కావడం విశేషం.
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు కేవలం ఐదు నెలల ముందు జరిగిన ఈ కీలక పరిణామంలో న్యూయార్క్ జ్యూరీ గురువారం రహస్య డబ్బు చెల్లింపు కేసులో డొనాల్డ్ ట్రంప్‌ను అన్ని ఆరోపణలపై దోషిగా నిర్ధారించింది. పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్‌కు ట్రంప్ డబ్బు ఇచ్చిన కేసు 2016 నాటిది. వాస్తవానికి ఈ పోర్న్ స్టార్‌తో ట్రంప్‌నకు సంబంధాలున్నాయని, దానిని దాచిపెట్టేందుకు ఆయన స్టార్మీకి రూ.1 లక్ష 30 వేలు ఇచ్చారని ఆరోపణలు వచ్చాయి. 2006లో ట్రంప్‌తో తనకు ఎఫైర్ ఉందని పోర్న్ స్టార్ స్టార్మీ వెల్లడించింది. తనను టీవీ స్టార్‌ని చేస్తానని హామీ ఇచ్చి ట్రంప్ తనతో శారీరక సంబంధాలు పెట్టుకున్నారని పోర్న్ స్టార్ ఆరోపించింది. అయితే దీనిని ట్రంప్ ఖండించారు.
ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు వ్యతిరేకంగా వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ పోటి చేస్తున్న క్రమంలో ఇది ట్రంప్‌కు పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పవచ్చు. జ్యూరీ తీర్పు తర్వాత ట్రంప్ విచారణను తీవ్రంగా ఖండించారు. మాన్‌హట్టన్ డిస్ట్రిక్ట్ అటార్నీ, బైడెన్ అడ్మినిస్ట్రేషన్‌ను ట్రంప్ విమర్శించారు. ఈ కేసుపై తన ప్రభావం గురించి నిరాధారమైన వాదనలు చేశారని వ్యాఖ్యానించారు. ఈ నిర్ణయాన్ని ట్రంప్ న్యాయవాద బృందం సవాలు చేయనుంది. ఈ కేసులో దోషిగా తేలిన తర్వాత కూడా డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హత సాధిస్తారని న్యాయ నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి:
Alert: వీటికి నేడే లాస్ట్ డేట్.. లేదంటే ఫైన్ కట్టాల్సిందే
Credit Card: క్రెడిట్ కార్డు వాడుతున్నారా..ఈ మోసాల పట్ల జాగ్రత్త
Read Latest International News and Telugu News
Updated Date - May 31 , 2024 | 09:06 AM