ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Donald Trump : సరైన సమయంలో తల తిప్పకపోతే చనిపోయి ఉండేవాడిని

ABN, Publish Date - Jul 16 , 2024 | 03:02 AM

‘‘సరైన సమయంలో, కాకతాళీయంగా తల తిప్పాను. లేకపోతే చనిపోయి ఉండేవాడిని. దేవుడి దయ, అదృష్టం వల్ల బతికి ఉన్నాను’’ అని అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ అన్నారు.

వాషింగ్టన్‌, జూలై 15: ‘‘సరైన సమయంలో, కాకతాళీయంగా తల తిప్పాను. లేకపోతే చనిపోయి ఉండేవాడిని. దేవుడి దయ, అదృష్టం వల్ల బతికి ఉన్నాను’’ అని అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ అన్నారు. తనపై హత్యాయత్నం తర్వాత తొలిసారి ఆయన న్యూయార్క్‌ పోస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన భావోద్వేగాన్ని పంచుకొన్నారు.

నవంబరు 5న జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ తమ అభ్యర్థిని సోమవారం ప్రకటించనుండడంతో.. ఆదివారం మిల్వాకీ బయలుదేరిన ఆయన విమానంలో ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ సమయంలో ఆయన కుడి చెవికి బ్యాండేజీ కట్టు ఉన్నట్లు న్యూయార్క్‌ పోస్ట్‌ వెల్లడించింది.

కాగా.. ట్రంప్‌ ఈ ఘటన నుంచి క్షేమంగా బయటపడడం పూరి జగన్నాథుడి కృపేనని ఇస్కాన్‌ సంస్థ ప్రతినిధి రాధారమణ్‌దాస్‌ అభిప్రాయపడ్డారు. మరోవైపు.. ట్రంప్‌పై హత్యాయత్నం చేసిన దుండగుడు థామస్‌ మాథ్యూ క్రూక్స్‌(20) ఫొటోలను ఎఫ్‌బీఐ విడుదల చేసింది.

Updated Date - Jul 16 , 2024 | 03:02 AM

Advertising
Advertising
<