ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Paris: ఫ్రాన్స్‌లో డ్రగ్స్‌ గ్యాంగ్‌ బీభత్సం

ABN, Publish Date - May 16 , 2024 | 03:51 AM

విలన్‌ను పోలీసులు అరెస్టు చేసి వ్యాన్‌లో తీసుకువెళ్తారు.. అతని అనుచరులు దారి మధ్యలో కాపుకాసి, వ్యాన్‌ను అడ్డగించి పోలీసులను కాల్చివేసి తమ నాయకుడిని విడిపించుకొని పోతారు.. ఎన్నో సినిమాల్లో ఈ సీన్‌ చూసి ఉంటారు. అచ్చం అదే తరహాలో ఫ్రాన్స్‌లో ఓ గ్యాంగ్‌ తమ నాయకుడిని పోలీసుల నుంచి విడిపించుకుపోయింది. పోలీసుల కాన్వాయ్‌ను ఆపి మిషన్‌ గన్‌లతో కాల్పులు జరిపి తమ నాయకుడిని తీసుకొని పోయింది. ఈ గ్యాంగ్‌ జరిపిన దాడిలో ఇద్దరు సెక్యూరిటీ గార్డులు చనిపోయారు.

  • పోలీస్‌ కాన్వాయ్‌పై తుపాకులతో దాడి

  • తమ నాయకుడు ‘ది ఫ్లై’ని తీసుకొని పరార్‌

పారిస్‌, మే 15: విలన్‌ను పోలీసులు అరెస్టు చేసి వ్యాన్‌లో తీసుకువెళ్తారు.. అతని అనుచరులు దారి మధ్యలో కాపుకాసి, వ్యాన్‌ను అడ్డగించి పోలీసులను కాల్చివేసి తమ నాయకుడిని విడిపించుకొని పోతారు.. ఎన్నో సినిమాల్లో ఈ సీన్‌ చూసి ఉంటారు. అచ్చం అదే తరహాలో ఫ్రాన్స్‌లో ఓ గ్యాంగ్‌ తమ నాయకుడిని పోలీసుల నుంచి విడిపించుకుపోయింది. పోలీసుల కాన్వాయ్‌ను ఆపి మిషన్‌ గన్‌లతో కాల్పులు జరిపి తమ నాయకుడిని తీసుకొని పోయింది. ఈ గ్యాంగ్‌ జరిపిన దాడిలో ఇద్దరు సెక్యూరిటీ గార్డులు చనిపోయారు. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఫ్రాన్స్‌లో మహ్మద్‌ అమ్రా అనే వ్యక్తి ఓ డ్రగ్స్‌ గ్యాంగ్‌కు లీడర్‌. అంతా అతన్ని ‘ది ఫ్లై’ అని పిలుస్తారు. అతడిని పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు.


మంగళవారం కోర్టులో విచారణ కోసం రోయూన్‌ పట్టణం నుంచి నార్మండీకి తీసుకువెళ్తుండగా, మార్గమధ్యలో ఓ టోల్‌ బూత్‌ దగ్గర మాటేసిన అతని అనుచరులు ముసుగులు ధరించి కాన్వాయ్‌ను కారుతో ఢీకొట్టారు. కాన్వాయ్‌పై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఆ తర్వాత ‘ది ఫ్లై’ని తీసుకొని పారిపోయారు. ఈ దాడి ఘటన అంతా టోల్‌ బూత్‌ దగ్గర ఉన్న కెమెరాల్లో రికార్డు అయింది. ఈ ఘటనపై ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మేక్రాన్‌ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. నిందితులను తప్ప శిక్షిస్తామన్నారు. నిందితుల కోసం వేట సాగుతోంది. కాగా, ఫ్రాన్స్‌లో ఇటీవల డ్రగ్స్‌ సంబంధిత నేరాలు బాగా పెరిగిపోయాయి. దీనిపై, ఆ దేశ సెనెట్‌ మంగళవారమే ఓ నివేదిక విడుదల చేసింది.

Updated Date - May 16 , 2024 | 03:51 AM

Advertising
Advertising