ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Fake Gold: ఫేక్ గోల్డ్ కలకలం.. ప్రజల భయాందోళన

ABN, Publish Date - May 03 , 2024 | 10:50 AM

నకిలీ వస్తువులు తయారు చేయడంలో చైనా(china) దేశం మొదటి స్థానంలో ఉంటుంది. ఈ దేశంలో ఐఫోన్ నుంచి చిన్న చిన్న బొమ్మల వరకు ప్రతి వస్తువును కాపీ చేసి తక్కువ ధరకు అమ్మేస్తుంటారు. ఈ క్రమంలో చైనా(china)లో ఇటివల పెద్ద ఎత్తున ఫేక్ గోల్డ్ అభరణాలు తీసుకుని మోసపోయిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి.

fake gold scam in china

నకిలీ వస్తువులు తయారు చేయడంలో చైనా(china) దేశం మొదటి స్థానంలో ఉంటుంది. ఈ దేశంలో ఐఫోన్ నుంచి చిన్న చిన్న బొమ్మల వరకు ప్రతి వస్తువును కాపీ చేసి తక్కువ ధరకు అమ్మేస్తుంటారు. ఈ క్రమంలో చైనా(china)లో ఇటివల పెద్ద ఎత్తున ఫేక్ గోల్డ్ అభరణాలు తీసుకుని మోసపోయిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. అంతేకాదు గతంలో కూడా చైనాలో ఉన్న బంగారం(gold) నిల్వలో 4 శాతానికి పైగా నకిలీదని తేలింది.


చైనాలో ఎక్కువ మంది తమ పొదుపులను బంగారంగా మార్చాలని చూస్తున్న క్రమంలోనే నకిలీ బంగారం(fake gold) ప్రధాన సమస్యగా మారుతోందని అక్కడి మార్కెట్ రీసెర్చ్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ షాన్ రీన్ తెలిపారు. 24 క్యారెట్, తక్కువ నాణ్యత గల బంగారం మధ్య తేడాలను గుర్తించలేని అనేక మంది వినియోగదారులు ఇన్‍‌వెస్ట్ చేస్తూ మోసపోతున్నారని చెప్పారు. ఆ క్రమంలోనే పలువురు ఆన్‌లైన్ ప్లాట్ ఫాంల ద్వారా తీసుకున్న పుత్తడి నకిలీదని వెలుగులోకి వచ్చింది. అంతేకాదు ఈ విధంగా వేల మంది కూడా పలు వెబ్‌సైట్ల తీసుకున్న పుత్తడిని ఆభరణాల వ్యాపారి వద్ద చెక్ చేయించగా ఫేక్ గోల్డ్ అని తేలింది.


ప్రస్తుతం చైనాలో ఫేక్ గోల్డ్ అంశం అక్కడి స్థానికుల్లో కలవరం రేపుతోంది. ఏది మంచి బంగారం, ఏది నకిలీదో తెలియక సతమతమవుతున్నారు. అయితే నకిలీ బంగారంను వేడి చేసినప్పుడు ముదురు రంగు లేదా ఆకుపచ్చ రంగుగా మారుతుంది. కానీ స్వచ్ఛమైన బంగారం వేడికి గురైనప్పుడు ప్రకాశవంతంగా కనిపిస్తుంది. 2023లో భారత్‌ను అధిగమించి ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు ఆభరణాల కొనుగోలుదారుగా చైనా అవతరించింది.

వినియోగదారుల(customers) డిమాండ్‌లో అగ్రగామిగా ఉంది. ఆ క్రమంలో చైనీస్ వినియోగదారులు గత ఏడాది 603 టన్నుల బంగారు ఆభరణాలను కొనుగోలు చేశారు. ఇది 2022 నుంచి 10% పెరిగింది. కానీ ఇప్పుడు కొనుగోలు చేసిన పుత్తడిలో ఫేక్ ఉందని తెలియడంతో అనేక మంది ఆందోళన చెందుతున్నారు.


ఇది కూడా చదవండి:

Bank Holidays: మేలో బ్యాంకులకు ఇన్ని రోజులు సెలవులా.. ఈ తేదీల్లో బ్యాంకులు బంద్

Airlines: ఒకప్పుడు ఫ్లైట్ అటెండెంట్.. ఇప్పుడు అదే ఎయిర్‌లైన్స్‌కు బాస్


Read Latest International News and Telugu News

Updated Date - May 03 , 2024 | 10:53 AM

Advertising
Advertising