స్కూల్‌ బస్సుకు మంటలు.. 23 మంది మృతి

ABN, Publish Date - Oct 02 , 2024 | 03:22 AM

ప్రమాదవశాత్తు ఓ పాఠశాల బస్సు మంటల్లో చిక్కుకోవడంతో దాదాపు 23 మంది మృతిచెందిన ఘటన థాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంకాక్‌ శివారులోని థాని ప్రావిన్స్‌లో మంగళవారం జరిగింది.

స్కూల్‌ బస్సుకు మంటలు.. 23 మంది మృతి

  • వారిలో 20 మంది విద్యార్థులే

  • బ్యాంకాక్‌లో దుర్ఘటన

  • 20 మంది చిన్నారులు మృతి

బ్యాంకాక్‌, అక్టోబరు 1: ప్రమాదవశాత్తు ఓ పాఠశాల బస్సు మంటల్లో చిక్కుకోవడంతో దాదాపు 23 మంది మృతిచెందిన ఘటన థాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంకాక్‌ శివారులోని థాని ప్రావిన్స్‌లో మంగళవారం జరిగింది. మృతుల్లో 20 మంది చిన్నారులతో పాటు ముగ్గురు ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. విహార యాత్రకు వెళ్లి వస్తుండగా బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఈ దుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో మొత్తం 44 మంది ఉన్నారు.

Updated Date - Oct 02 , 2024 | 03:23 AM