Jimmy Carter: 100 ఏళ్ల వయసులో అమెరికా మాజీ అధ్యక్షుడు మృతి
ABN, Publish Date - Dec 30 , 2024 | 07:46 AM
అమెరికా 39వ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ 100 ఏళ్ల వయసులో జార్జియాలోని తన స్వగృహంలో ఆదివారం రాత్రి కన్నుమూశారు. కార్టర్ 1977 నుంచి 1981 వరకు USA 39వ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన గురంచి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.
అమెరికా మాజీ 39వ అధ్యక్షుడు (Former US President) జిమ్మీ కార్టర్ (Jimmy Carter) 100 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. అమెరికా (america) జార్జియాలోని తన స్వగృహంలో ఆదివారం రాత్రి మరణించారు. జార్జియాలోని ప్లెయిన్స్‌లో 1924లో జన్మించిన కార్టర్, 39వ అధ్యక్షుడిగా 1977 నుంచి 1981 వరకు పనిచేశారు. ఆయన అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అనేక సమస్యలను ఎదుర్కొన్నారు. అందులో ఆర్థిక మాంద్యం, ఇరాన్ బందీ సంక్షోభం ఉన్నాయి. జిమ్మీ కార్టర్ 1978లో ఇజ్రాయెల్, ఈజిప్ట్ మధ్య చారిత్రాత్మక శాంతి ఒప్పందం, క్యాంప్ డేవిడ్ ఒప్పందంగా పిలువబడే ఒప్పందాన్ని సేకరించటంతో మంచి పేరు పొందారు. ఈ ఒప్పందం మిడిల్ ఈస్ట్‌లో శాంతి నెలకొల్పటానికి గొప్ప నిర్ణయంగా నిలిచింది.
నోబెల్ పొందిన మాజీ అధ్యక్షుడు
దీంతోపాటు కార్టర్ అమెరికా-ఇజ్రాయెల్ సంబంధాలను పటిష్టం చేశారు. కార్టర్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆరోగ్య సంరక్షణ, విద్య, ప్రజా ఆరోగ్యానికి సంబంధించిన పలు విధానాలను కూడా అమలు చేశారు. ఈ క్రమంలో శాంతి కృషిలో అనేక అమూల్యమైన సేవలు అందించారు. దీంతో 2002లో ప్రభావవంతమైన నోబెల్ శాంతి బహుమతి పొందారు.
కార్టర్‌కు 1946లో రోసలిన్ స్మిత్‌తో వివాహం జరిగింది. ఆయనకు నలుగురు పిల్లలు, 11 మంది మనుమలు, 14 మంది మనవరాళ్లు ఉన్నారు. 2022లో ఆయన భార్య రోసలిన్ 96 సంవత్సరాల వయసులో మరణించారు. కార్టర్ గత కొన్నేళ్లుగా క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్నారు. 2023లో ఆయనకు చర్మ క్యాన్సర్ అయిన మెలనోమా వచ్చింది. దీని కారణంగా కాలేయం, మెదడు కూడా ప్రభావితమైంది.
ప్రముఖుల నివాళులు..
కార్టర్ మరణం గురించి తెలుసుకున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సహా పలు దేశాల నేతలు ఆయనకు నివాళులర్పించారు. బిల్ క్లింటన్, ఆయన భార్య హిల్లరీ క్లింటన్ కూడా సంతాపం ప్రకటించారు. కార్టర్ చివరి వరకు ఇతరులకు సేవ చేయడానికి తన జీవితాన్ని అంకితమించిన వ్యక్తి అని కొనియాడారు. జిమ్మీ కార్టర్ పేరు చరిత్రలో నిలుస్తుందని, అత్యంత సంకల్పవంతమైన నాయకులలో ఆయన కూడా ఒకరని పేర్కొన్నారు. ఆయన పంచిన విధేయత, అందించిన సేవలు ఆయనను మంచి మనిషిగా చేశాయని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
Investment Tips: 20 ఏళ్లలో రూ. 5 కోట్లు సంపాదించాలంటే.. ఏ స్కీంలో పెట్టుబడి చేయాలి..
Investment Tips: రూ. 20 వేల శాలరీ వ్యక్తి.. ఇలా రూ. 6 కోట్లు సంపాదించుకోవచ్చు..
Cyber Protection: సైబర్ మోసాల నుంచి మీ డెబిట్, క్రెడిట్ కార్డ్‌లను ఇలా రక్షించుకోండి..
Public Holidays: 2025లో పబ్లిక్ హాలిడేస్ ఎన్ని రోజులో తెలుసా..
Read More International News and Latest Telugu News
Updated Date - Dec 30 , 2024 | 08:37 AM