Share News

US Elections: అమెరికాలో అధ్యక్ష ఎన్నికల్లో ఈ 2 రాష్ట్రాలే కీలకం.. ఇవే డిసైడ్ చేస్తాయా..

ABN , Publish Date - Nov 02 , 2024 | 07:19 AM

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమయం దగ్గర పడింది. ఇప్పటికే అనేక మంది ఓటర్లు ముందస్తుగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రధాన ఓటింగ్ మాత్రం నవంబర్ 5న జరగనుంది. అయితే ఓ రెండు రాష్ట్రాల్లోని ఓటింగ్ మాత్రం అభ్యర్థి గెలుపునకు కీలకం కానుందని సర్వేలు చెబుతున్నాయి.

US Elections: అమెరికాలో అధ్యక్ష ఎన్నికల్లో ఈ 2 రాష్ట్రాలే కీలకం.. ఇవే డిసైడ్ చేస్తాయా..
US Elections 2024

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు (US presidential election 2024) సమయం దగ్గర పడింది. ఇంకా రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది. నవంబర్ 5న అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే దాదాపు ఆరు కోట్ల మందికిపైగా అమెరికన్ ఓటర్లు ముందస్తుగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఓటర్లు మెయిల్ ద్వారా లేదా వ్యక్తిగతంగా ఓటు వేయడం ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మిగతా ఓటర్లు ఐదో తేదీన ఓటు వేయనున్నారు. అమెరికన్ ఓటర్లు తమ తదుపరి అధ్యక్షుడిగా రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమొక్రాట్ అభ్యర్థి కమలా హారిస్‌లలో ఎవరినైనా ఎన్నుకుంటారు. కానీ ఈసారి ట్రంప్, హారిస్ మధ్య గట్టి పోటీ నెలకొంది.


ఈ ప్రాంతాల్లో గట్టి పోటీ

సీఎన్ఎన్ సర్వే ప్రకారం జార్జియా, నార్త్ కరోలినాలో కమలా హారిస్, డొనాల్డ్ ట్రంప్ మధ్య గట్టి పోటీ ఉంది. జార్జియాలో 48 శాతం మంది ఓటర్లు ట్రంప్‌కు అనుకూలంగా ఉండగా, హారిస్‌కు 47 శాతం మంది మద్దతు ఉంది. రెండింటి మధ్య ఒక శాతం మాత్రమే తేడా ఉంది. ఇక నార్త్ కరోలినాలో కమలా హారిస్‌కు 48 శాతం ఓటర్లు, ట్రంప్‌నకు 47 శాతం మంది సపోర్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ రెండు రాష్ట్రాల ఓట్లు గెలుపునకు కీలకంగా మారనున్నాయని పలువురు అంటున్నారు. కానీ మెయిల్ ద్వారా ఓటింగ్ చేయడం వల్ల ఎన్నికల ఫలితాలు ఆలస్యమవుతాయని భావిస్తున్నారు.


గతంలో ఇలా

నార్త్ కరోలినా 2008లో బరాక్ ఒబామాకు మద్దతు ఇచ్చింది. అయితే గత మూడు అధ్యక్ష ఎన్నికల్లో ఇక్కడ రిపబ్లికన్ పార్టీదే ఆధిపత్యం. 2020 ఎన్నికల్లో జో బైడెన్‌పై కూడా ట్రంప్ విజయం సాధించారు. జార్జియాలో డెమొక్రాట్లు 28 ఏళ్ల తర్వాత విజయం సాధించారు. నాలుగేళ్ల క్రితం జార్జియాలో డోనాల్డ్ ట్రంప్‌ను ఒక శాతం కంటే తక్కువ తేడాతో అధ్యక్షుడు జో బైడెన్ ఓడించారు. కానీ జార్జియాలో బైడెన్ విజయం చారిత్రాత్మకమైనది. 1992లో తొలిసారిగా డెమొక్రాట్ అభ్యర్థి బిల్ క్లింటన్ విజయం సాధించడమే ఇందుకు కారణం.


భారతీయ అమెరికన్ ఓటర్లు ఎటువైపు

2020లో బైడెన్ 28 సంవత్సరాల తర్వాత డెమొక్రాట్ అభ్యర్థిగా తన మొదటి విజయాన్ని సాధించారు. కమలా హారిస్‌కు భారతీయ అమెరికన్ ఓటర్ల నుంచి తక్కువ మద్దతు లభిస్తోందని ఓ సర్వే తెలిపింది. అయితే భారతీయ అమెరికన్ ఓటర్లను డెమోక్రటిక్ పార్టీ సంప్రదాయ ఓటర్లుగా పరిగణిస్తారు. కార్నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్ చేసిన సర్వే ప్రకారం కమలా హారిస్ జో బైడెన్ కంటే తక్కువ భారతీయ అమెరికా ఓటర్ల నుంచి ఓట్లు పొందే అవకాశం ఉంది. ఈ క్రమంలో భారతీయ అమెరికన్ ఓటర్లు కూడా ఈ ఎన్నికల్లో కీలకం కానున్నారు.


ఇవి కూడా చదవండి:

SIP Investment: చిరు ఉద్యోగస్తులకు గుడ్‌ న్యూస్.. రూ.99 నుంచే మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు

Bank Holidays: నవంబర్ 2024లో బ్యాంక్ సెలవులు.. దాదాపు సగం రోజులు బంద్..

Investment Tips: ఒకేసారి రూ. 12 లక్షలు పెట్టుబడి చేసి మరచిపోండి.. ఆ తర్వాత ఎంతవుతుందంటే..

Read More International News and Latest Telugu News

Updated Date - Nov 02 , 2024 | 07:30 AM