ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Donald Trump: ఎన్నికల ర్యాలీలో డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు..

ABN, Publish Date - Jul 14 , 2024 | 06:10 AM

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు మరోసారి అగ్రరాజ్యంలో కాల్పులు కలకలం రేపుతున్నాయి. ఏకంగా అధ్యక్ష ఎన్నికలకు పోటీ చేయనున్న డొనాల్డ్ ట్రంప్(Donald Trump) నిర్వహించిన ర్యాలీపై కాల్పులు చోటుచేసుకోవడం సంచలనం సృష్టిస్తోంది.

Donald Trump

అమెరికా(America) అధ్యక్ష ఎన్నికలకు ముందు మరోసారి అగ్రరాజ్యంలో కాల్పులు కలకలం రేపుతున్నాయి. ఏకంగా అధ్యక్ష ఎన్నికలకు పోటీ చేయనున్న డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పైనే కాల్పులు జరిగాయి. పెన్సిల్వేనియాలోని (Pennsylvania) బట్లర్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఈ ఘటన చోటుచేసుకుంది. దుండగుడి కాల్పుల్లో ట్రంప్ చెవికి తీవ్ర గాయమైంది. ప్రచారానికి హాజరైన ఒకరు మరణించారని సమాచారం.

ఒకసారి కాదు..!

ట్రంప్ ర్యాలీలో పలుమార్లు తుపాకీ కాల్పుల శబ్దం వినిపించింది. కాల్పుల చప్పుడు వినిపించిన వెంటనే సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు వెంటనే అప్రమత్తమై ఆయనను వేదికపై నుంచి దించి కారు వద్దకు తీసుకెళ్లారు. ఆ సమయంలో డొనాల్డ్ ట్రంప్ తన మద్దతుదారులను పిడికిలి బిగించి ఉత్సాహపరిచారు. ఆ క్రమంలో గాయపడిన ట్రంప్‌ను వైద్యం కోసం ఆస్పత్రికి తీసుకెళ్లారు. సమాచారం ప్రకారం ట్రంప్ చెవికి గాయమైనట్లు తెలిసింది. ఆయన ముఖానికి కూడా రక్తం అంటుకుంది.


హింసకు తావులేదు..

ఈ కాల్పులు జరిపిన తర్వాత సాయుధుడు మరణించినట్లు చెబుతున్నారు. ఈ ఘటన తర్వాత ట్రంప్ క్షేమంగా ఉన్నారని, వైద్యం జరుగుతోందని ట్రంప్ ప్రతినిధి తెలిపారు. మరోవైపు డొనాల్డ్ ట్రంప్ ర్యాలీపై కాల్పులు జరిగినట్లు తనకు సమాచారం అందిందని అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్(joe biden) ట్వీట్ చేశారు. తాను ట్రంప్, ఆయన ఫ్యామిలీ, అక్కడ ఉన్న ప్రజలందరి క్షేమం కోసం ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. అమెరికాలో ఇలాంటి హింసకు తావు లేదని, దీనిని ఖండించడానికి మనం ఒక జాతిగా ఏకం కావాలని అన్నారు. ఈ క్రమంలో ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.


ఇది కూడా చదవండి:

Elon Musk: అమెరికా ఎన్నికల వేళ.. ఎలాన్ మస్క్ భారీ విరాళం, కారణమిదేనా?

Warranty vs Guarantee: మీకు వారంటీ, గ్యారెంటీ మధ్య తేడా తెలుసా.. లేదంటే నష్టపోతారు జాగ్రత్త..!

Read Latest International News and Telugu News

Updated Date - Jul 14 , 2024 | 08:29 AM

Advertising
Advertising
<