Gun Shot: బార్‌లో కాల్పులు.. ఇద్దరు మృతి, ఏడుగురికి గాయాలు
ABN, Publish Date - Apr 07 , 2024 | 07:32 AM
అగ్రరాజ్యం అమెరికా(america)లో మళ్లీ కాల్పులు(gun Shot) కలకలం రేపుతున్నాయి. తాజాగా ఫ్లోరిడా(Florida)లోని ఓ బార్(bar)లో కాల్పుల ఘటన చోటుచేసుకోగా, ఇద్దరు వ్యక్తులు మరణించగా, ఏడుగురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఓ పోలీసు అధికారి కూడా ఉన్నారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు కాల్పులు జరిపిన వ్యక్తిని అక్కడికక్కడే హతమార్చారు.
అగ్రరాజ్యం అమెరికా(america)లో మళ్లీ కాల్పులు(gun Shot) కలకలం రేపుతున్నాయి. తాజాగా ఫ్లోరిడా(Florida)లోని ఓ బార్(bar)లో కాల్పుల ఘటన చోటుచేసుకోగా, ఇద్దరు వ్యక్తులు మరణించగా, ఏడుగురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఓ పోలీసు అధికారి కూడా ఉన్నారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు కాల్పులు జరిపిన వ్యక్తిని అక్కడికక్కడే హతమార్చారు. శనివారం తెల్లవారుజామున 3:30 గంటలకు ఒక వ్యక్తి తుపాకీని తీసి, ఒక వివాదం నేపథ్యంలో సెక్యూరిటీ గార్డుపై కాల్పులు జరిపాడని మియామి పోలీసులు తెలిపారు. కాల్పుల్లో ఒక మహిళతో సహా సమీపంలో ఉన్న ఆరుగురిపై కాల్పులు జరిగాయని వెల్లడించారు.
అయితే మియామీ(Miami Dade) సిటీ ప్లేస్ డోరల్‌లోని మార్టినీ బార్‌లో వాగ్వాదం జరిగిందని, దీంతో సెక్యూరిటీ గార్డులు జోక్యం చేసుకున్నారని పోలీసులు(police) తెలిపారు. ఆ క్రమంలో సెక్యూరిటీ గార్డు అడ్డుకోవడంతో షూటర్ తుపాకీని తీసి గార్డును కాల్చాడని వెల్లడించారు. ఆ క్రమంలో పోలీసులు కాల్పులు జరిపిన వ్యక్తిని అక్కడికక్కడే హతమార్చారని చెప్పారు. అదే సమయంలో ఓ పోలీసు అధికారి కాలుకు బుల్లెట్ తగిలింది.
ఫ్లోరిడా డిపార్ట్‌మెంట్ ఆఫ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఈ కాల్పుల(firing) ఘటనపై దర్యాప్తు చేస్తోంది. అయితే అసలు గొడవ ఎందుకు మొదలైందో ఇంకా నిర్ధారించలేదని అధికారులు అన్నారు. శనివారం కూడా అక్కడున్న వారిని అధికారులు విచారణ చేశారు. మాల్‌లోని కొన్ని భాగాలను సీజ్ చేసి ఆధారాలు సేకరించారు. గత కొన్నేళ్లుగా అమెరికాలో కాల్పుల ఘటనలు ఎక్కువయ్యాయి. ఓ నివేదిక ప్రకారం తుపాకీ కాల్పుల్లో(gun Shots) మరణాల విషయంలో 10 మిలియన్ల కంటే ఎక్కువ జనాభా ఉన్న అధిక ఆదాయ దేశాలలో US మొదటి స్థానంలో ఉండటం చర్చనీయాంశంగా మారింది.
ఇది కూడా చదవండి:
IPL 2024: రాజస్థాన్ చేతిలో ఆర్సీబీ ఓటమికి కారణాలివే..ఇలా చేయకుంటే
India-Maldives Row: భారత్‌కు కృతజ్ఞతలు తెలిపిన మాల్దీవులు.. ఎందుకో తెలుసా?
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం
Updated Date - Apr 07 , 2024 | 07:35 AM