Donald Trump: డొనాల్డ్ ట్రంప్‌పై మళ్లీ కాల్పులు?.. ఆయన స్పందన ఇదే
ABN, Publish Date - Sep 16 , 2024 | 07:08 AM
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై మరోసారి కాల్పుల దాడి జరిగింది. ఆదివారం ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్‌లోని తన గోల్ఫ్ కోర్స్‌లో గోల్ఫ్ ఆడుతున్న క్రమంలో అక్కడ కాల్పులు జరిగాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై డొనాల్డ్ ట్రంప్ స్పందించారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్(Donald Trump)పై ఇటీవల ఫిలిడెల్ఫియాలో హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. ఆ ఘటనను మరచిపోకముందే మరో హత్యాయత్నం ఘటన కలకలం రేపింది. ఫ్లోరిడాలోని వెస్ట్ ఫామ్ బీచ్ ప్రాంతంలో ఉన్న ట్రంప్ ఇంటర్నేషనల్ గోల్ఫ్ క్లబ్ సమీపంలో కాల్పుల ఘటన సంచలనం సృష్టించింది.
ఘటనపై
ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో (భారత కాలమానం ప్రకారం రాత్రి 11.30 గంటలు) ఈ కాల్పులు జరిగినట్లు అమెరికా సీక్రెట్ సర్వీస్ విభాగం తెలిపింది. అయితే, ట్రంప్‌ను లక్ష్యంగా చేసుకొనే ఈ కాల్పులు జరిగాయా.. లేదా.. అన్నదానిపై స్పష్టత లేదని పేర్కొంది. మరోవైపు ట్రంప్ ప్రచార బృందం కూడా కాల్పుల ఘటనపై ప్రకటన చేసింది. ‘‘ట్రంప్ సురక్షితంగానే ఉన్నారు. ఇంతకుమించి ఇప్పుడేం చెప్పలేం’’ అని ప్రచారం బృందం అధికారిక ప్రతినిధి స్టీవెన్ వెల్లడించారు.
ట్రంప్ రియాక్షన్
ఈ ఘటనపై స్పందించిన ట్రంప్ తాను క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నట్లు తెలియజేశారు. తన చుట్టూ తుపాకీ శబ్దాలు వినిపించాయన్నారు. కానీ ఎన్నికల ప్రచారం నుంచి తనను ఎవరూ ఆపలేరని అన్నారు. ఎప్పటికీ లొంగిపోనని అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే జులైలో జరిగిన కాల్పుల తర్వాత ట్రంప్‌పై ఇటివల మళ్లీ జరగడం చర్చనీయాంశంగా మారింది. గోల్ఫ్ క్లబ్‌లో కాల్పులు జరిపిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తెలిపారు. అతని పేరు ర్యాన్ వెస్లీ రోత్ అని, ఘటనా స్థలంలో పొదల్లో ఏకే 47 దొరికిందన్నారు. అదే సమయంలో సీక్రెట్ సర్వీస్ కూడా ఈ వ్యవహారంపై దర్యాప్తు ప్రారంభించింది.
పేలిన బుల్లెట్లు
ఈ కేసుకు సంబంధించిన సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం ట్రంప్ ఇంటర్నేషనల్ గోల్ఫ్ క్లబ్‌లో పేలిన బుల్లెట్లు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను లక్ష్యంగా చేసుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు. వెస్ట్ పామ్ బీచ్‌లోని ట్రంప్ ఇంటర్నేషనల్ గోల్ఫ్ కోర్స్‌లో సీక్రెట్ సర్వీస్ అనుమానాస్పద వ్యక్తిని గుర్తించినట్లు ఆయా వర్గాలు తెలిపాయి. దీని తర్వాత ఏజెంట్లు అక్కడి తుపాకీ బారెల్‌ను పోలి ఉండటం చూసి, వారు కాల్పులు జరిపారు.
హింసకు తావు లేదు
అదే సమయంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల అభ్యర్థి కమలా హారిస్ కూడా ఈ ఘటనను ఖండించారు. మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఉన్న ఫ్లోరిడాలోని గోల్ఫ్ కోర్స్ దగ్గర కాల్పులు జరిగినట్లు నాకు సమాచారం అందిందని ఆమె అన్నారు.‘‘హింసకు అమెరికాలో చోటు లేదు. ట్రంప్ సురక్షితంగా ఉన్నారని తెలిసి సంతోషంగా ఉంది’’ అని ఆమె వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని జో బైడెన్, వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్‌లకు తెలియజేశామని వైట్‌హౌస్ తెలిపింది.
ట్రంప్ టార్గెట్
అంతకుముందు జులై 14న పెన్సిల్వేనియాలో ట్రంప్ ర్యాలీ సందర్భంగా కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు గాయపడ్డారు. దాడి చేసిన వ్యక్తిని 20 ఏళ్ల థామస్ మాథ్యూ క్రూక్స్‌గా గుర్తించారు. అతను దాడి జరిగిన కొద్దిసేపటికే సీక్రెట్ సర్వీస్ స్నిపర్‌లచే చంపబడ్డాడు. దాడి నుంచి ట్రంప్ తృటిలో తప్పించుకోగా, చెవికి బుల్లెట్ గాయం తగిలింది.
ఇవి కూడా చదవండి:
Money Saving Plan: రిటైర్ మెంట్ వరకు రూ. 8 కోట్లు కావాలంటే.. నెలకు ఎంత సేవ్ చేయాలి..
Next Week IPOs: ఈ వారం మార్కెట్లోకి రానున్న ఐపీఓలు ఇవే.. ఈసారి ఎన్నంటే..
Insurance: ఇకపై సైబర్ స్కాంలకు కూడా ఇన్సూరెన్స్ .. రోజుకు ఎంతంటే..
Money Saving Tips: రోజు రూ.250 సేవ్ చేయండి.. ఇలా రూ.2 కోట్లు సంపాదించండి..
Read MoreInternational News and Latest Telugu News
Updated Date - Sep 16 , 2024 | 07:51 AM