Imran Khan: ఇమ్రాన్‌ఖాన్ పార్టీపై నిషేధానికి పాక్ సర్కార్ పావులు
ABN, Publish Date - Jul 15 , 2024 | 05:12 PM
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ పార్టీ 'పాకిస్థాన్ తెహ్రీక్ ఇన్సాఫ్' ను నిషేధించేందుకు ప్రభుత్వం పావులు కదుపుతోంది. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు ఈ చర్య తీసుకుంటున్నామని ఆ దేశ సమాచార శాఖ మత్రి అత్తావుల్లా తరార్ సోమవారంనాడిక్కడ తెలిపారు.
ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ (Imran Khan) పార్టీ 'పాకిస్థాన్ తెహ్రీక్ ఇన్సాఫ్' (PTI)ను నిషేధించేందుకు (Ban) ప్రభుత్వం పావులు కదుపుతోంది. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు ఈ చర్య తీసుకుంటున్నామని ఆ దేశ సమాచార శాఖ మత్రి అత్తావుల్లా తరార్ (Attaullha Tarar) సోమవారంనాడిక్కడ తెలిపారు.
''పీటీఐను నిషేదిస్తూ కేసు వేయనున్నాం. ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు చేపడుతుంది'' అని తరార్ తెలిపారు. పీటీఐపై ఆంక్షలు విధించేందుకు తగిన ఆధారాలు ఉన్నాయని, అందుకే తాము తగిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. 71 ఏళ్ల ఇమ్రాన్‌ఖాన్ 1996 పీటీఐ పార్టీని స్థాపించారు. 2018 నుంచి 2022 వరకూ ప్రధానమంత్రిగా సేవలందించారు. అయితే విశ్వాసపరీక్షలో ఓడిపోవడంతో 2022లో ఇమ్రాన్ ప్రభుత్వ కుప్పకూలింది. ముడుపుల కేసుతో ఫిబ్రవరి ఎన్నికల్లో ఖాన్ పోటీపై నిషేధం విధించారు. ఇన్ని ప్రతికూలతల మధ్య కూడా పీటీఐకు విధేయులైన అభ్యర్థులు ఇతర పార్టీల కంటే ఎక్కువ సీట్లు గెలుచుకున్నారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పాటుతో వారు అధికారానికి దూరంగా ఉండిపోయారు.
Donald Trump: ట్రంప్‌పై కాల్పులు.. నిందితుడి గురించి విస్తుపోయే నిజాలు
నిషేధాన్ని సహించం: పీటీఐ
కాగా, పీటీఐపై నిషేధానికి ప్రభుత్వం చర్యలకు దిగుతుండటంపై ఆపార్టీ ధ్వజమెత్తింది. ప్రభుత్వ ప్రయత్నాలను సహించేది లేదని, గతంలో కంటే పీటీఐ బలపడిందని, ప్రభుత్వ యత్నాలను సవాలు చేస్తామని పీటీఐ ప్రతినిధి రవూఫ్ హసన్ తెలిపారు. కాగా, ప్రస్తుతం పలు కేసులకు సంబంధించి రావల్పిండిలోని అడియాలో జైలులో ఇమ్రాన్‌ఖాన్ ఉన్నారు.
Read Latest International News and Telugu News
Updated Date - Jul 15 , 2024 | 05:12 PM