ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

US Arrest: రహస్య కెమెరాలతో మహిళలు, పిల్లల నగ్న వీడియోలు..

ABN, Publish Date - Aug 22 , 2024 | 04:57 AM

ఆస్పత్రులకు చికిత్స కోసం వచ్చే మహిళలు, పిల్లల నగ్న చిత్రాలను రహస్య కెమెరాలతో చిత్రీకరించటమేగాక పలువురిపై లైంగికదాడులకు పాల్పడిన ఉమర్‌ అజీజ్‌ అనే భారతీయ డాక్టర్‌ను అమెరికా పోలీసులు అరెస్టు చేశారు.

  • అమెరికాలో ఓ భారతీయ డాక్టర్‌ దుర్మార్గం

  • స్వయంగా భార్య ఫిర్యాదుతో వెలుగులోకి..

  • వేల సంఖ్యలో బాధితులు.. నిందితుడి అరెస్ట్‌

వాషింగ్టన్‌, ఆగస్టు 21: ఆస్పత్రులకు చికిత్స కోసం వచ్చే మహిళలు, పిల్లల నగ్న చిత్రాలను రహస్య కెమెరాలతో చిత్రీకరించటమేగాక పలువురిపై లైంగికదాడులకు పాల్పడిన ఉమర్‌ అజీజ్‌ అనే భారతీయ డాక్టర్‌ను అమెరికా పోలీసులు అరెస్టు చేశారు. ఆస్పత్రులలోని బాత్‌రూమ్‌లు, దుస్తులు మార్చుకునే గదులు తదితర ప్రాంతాల్లో రహస్యంగా కెమెరాలను ఏర్పాటు చేసి ఈ నగ్నచిత్రాలను, వీడియోలను ఉమర్‌ రికార్డు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఉమర్‌ భార్యనే స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేయటంతో అతడి దారుణాలు బయటపడ్డాయి.


పోలీసులు మిషిగన్‌లోని రోచ్‌స్టర్‌ హిల్స్‌లో ఉన్న వారి ఇంట్లో సోదా జరిపినప్పుడు దిగ్ర్భాంతికర అంశాలు వెల్లడయ్యాయి. ఉమర్‌ రికార్డు చేసిన మహిళల, పిల్లల నగ్న వీడియోలు, ఫొటోలు వేల సంఖ్యలో ఉన్నాయని తెలిసింది. అంతేకాదు, పలువురు మహిళలు స్పృహలో లేనప్పుడు, నిద్ర పోతున్నప్పుడు వారిపై లైంగికదాడులకు, అభ్యంతరకర చర్యలకు పాల్పడి ఆ దృశ్యాలను కూడా ఉమర్‌ రికార్డు చేశాడు. వీటిని భద్రపరిచిన పలు కంప్యూటర్లు, ఫోన్లు, 15 ఎక్స్‌టర్నల్‌ డివైజ్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై స్థానిక పోలీసు అధికారి మైక్‌ బుచర్డ్‌ మాట్లాడుతూ, ‘అనేక మంది బాధితులున్నట్లు తెలుస్తోంది.


ఆ దృశ్యాలు కలవరపరిచే విధంగా ఉన్నాయి. దర్యాప్తును ఇప్పుడే ప్రారంభించాం. పూర్తి చేయటానికి కొన్ని నెలలు పట్టవచ్చు’ అని తెలిపారు. కేవలం ఒక్క హార్డ్‌డ్రైవ్‌లోనే 13 వేల వీడియోలు ఉన్నాయన్నారు. ఇటువంటి అనేక వీడియోలను ఉమర్‌ క్లౌడ్‌స్టోరేజీలో కూడా అప్‌లోడ్‌ చేసి ఉండవచ్చని పేర్కొన్నారు. ఈ నెల 8వ తేదీన పోలీసులు ఉమర్‌ను అరెస్టు చేశారు. అనంతరం కోర్టు ఆదేశాల మేరకు 20 లక్షల డాలర్ల బాండుతో ఆక్లాండ్‌ కంట్రీ జైలుకు తరలించారు. 2011లో వర్కింగ్‌ వీసా మీద అమెరికాకు వెళ్లిన ఉమర్‌.. పలు ఆస్పత్రుల్లో వైద్యుడిగా పని చేశాడు. ఓ స్విమ్మింగ్‌పూల్‌ క్లబ్‌కూ కన్సల్టెంట్‌ డాక్టర్‌గా ఉన్నాడు. ఆయా ఆస్పత్రుల్లో, స్విమ్మింగ్‌పూల్‌ ఆవరణలోని గదుల్లో రహస్య కెమెరాలు పెట్టి నగ్న చిత్రాలు, వీడియోలు తీశాడు.


Also Read:

ఆళ్ల రామకృష్ణారెడ్డికి సుప్రీంకోర్టు సీరియస్

ఇసుకపై సమగ్ర పాలసీ..!!

ప్రమాదం...!!

For More Telangana News and Telugu News..

Updated Date - Aug 22 , 2024 | 12:34 PM

Advertising
Advertising
<